ఏపీలోని అధికార వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి మూలస్తంభం అయిన సోషల్ మీడియాను మీద తొలి దెబ్బ పడింది. పార్టీ అఫిషియల్ ట్విట్టర్‌ను కొందరు హ్యాక్ చేయడం ఇప్పుడు వైసీపీ పార్టీలో కలకలం రేపుతుంది. గత శుక్రవారం రాత్రే వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది. సాంకేతిక నిపుణులు దీనిని తిరిగి పున:రుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌రను ఎవరు హ్యాక్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…దేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా విభాగం వైసీపీ సొంతం. జగన్ వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా సోషల్ మీడియా ఆయనకు అనుకులంగా మారింది.
2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇదే సమయంలో జగన్ పాదయాత్ర మొదలుకుని, నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో వైసీపీ సోషల్ మీడియా విజయం సాధించింది. జగన్ విజయంలో వైసీపీ సోషల్ మీడియా ప్రాముఖ్యత చాలానే ఉంది. . వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తోన్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా. ఆ విషయం పలు సందర్భాల్లో బహిర్గతవ కూడా అయింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గానీ, అభివద్ధి ప్రాజెక్టులను గానీ ప్రజల వద్దకు చేరవేయడంలో ఈ విభాగం కీలక పాత్రను పోషిస్తోంది.
సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు విస్తృతంగా పని చేస్తోన్నారు. మరి అంతటి బలమైన వైసీపీ సోషల్ మీడియాను ఎవరో హ్యాక్ చేస్తుంటే.. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని హ్యాక్ చేశారు. నాన్ ఫింజిబిల్ టోకెన్ సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఆర్టికల్‌ను పిన్డ్ టాప్ చేశారు. బిట్ కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీకి ప్రమోషనల్ ఆర్టికల్స్ ఇందులో పోస్ట్ చేయడం జరిగింది.
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు భార్గవ పార్టీ సోషల్ మీడియా విభాగానికి అధిపతిగా పని చేస్తోన్నారు. ఇటీవలే జగన్ ఆయనను అపాయింట్ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేపట్టామని త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెలిపింది.