Friday, April 26, 2024

తంగిరాల సౌమ్య‌కు చంద్రబాబు బిగ్ షాక్… నందిగామ టికెట్ ఆయనకే..?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పి.. ప్రజలను సెంటిమెంట్‌తో బురిడి కొట్టి పనిలో కూడా ఆయన నిమగ్నమైయ్యారు. కాని చంద్రబాబు నైజం గురించి తెలిసిన ప్రజలు ఆయన్ను పెద్దగా నమ్మడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జనసేనతో కలిసి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అమరావతిని అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కొందరు పోటీకి దిగాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గం నుంచి అమరావతి ఉద్యమంలో కీలకంగా పని చేసిన నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావు (కర్రి శ్రీను)కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోతే..మరెవ్వరికి ఇస్తారని కొలికపూడి శ్రీనివాసరావు తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు తంగిరాల సౌమ్యకు పెద్దగా నియోజకవర్గం నుంచి కూడా మద్దతు లేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదన . ఇది ఇలా ఉంటే 2014 ఎన్నికల్లో తంగిరాల సౌమ్య ప్రభాకర్ విజయం సాధించిన తరువాత.. ఆయన కొద్ది కాలానికే మరణించారు. దీంతో ఆయన వారసురాలుగా తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నందిగామకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోటీ చేయకపోవడంతో.. చాలా ఈజీగానే తంగిరాల సౌమ్య విజయం సాధించారు.

కాని 2019 ఎన్నికలకు వచ్చే సరికి మొండితోక జగన్మోహన్ రావు చేతిలో తంగిరాల సౌమ్య ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ తంగిరాల సౌమ్యను కాదని కొలికపూడి శ్రీనివాసరావుకు నందిగామ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. పైగా తంగిరాల సౌమ్య ఇటీవల మీడియాలో కూడా అడ్డంగా దొరికిపోవడం కూడా .. ఆమె టికెట్‌కు ఎసరు వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంకట కుమారి అనే ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం లో వారికి ఏమి లబ్ది జరగలేదు అని చెప్పించి తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకొన్న సౌమ్య. కానీ వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం వెంకట కుమారి గారికి వైసీపీ వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలో అమ్మ ఓడి, ఇళ్ళ పట్టా, రైస్ కార్డ్, వైయస్సార్ హెల్త్ కార్డ్, డ్వాక్రా లోన్ అన్ని ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది. దీనిని వైసీపీ నాయకులు సాక్ష్యాలతో సహా నిరుపించడంతో … తంగిరాల సౌమ్య నోరు మూగపోయింది. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తనికి నందిగామలో తంగిరాల సౌమ్య టికెట్‌కు ఎసరు వచ్చినట్లుగానే కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!