Sunday, September 8, 2024

వైసీపీలోకి శైలజానాధ్.. జగన్ సమక్షంలో పార్టీ తీర్థం ..అక్కడ నుంచే పోటీ…?

- Advertisement -

ఏపీలో అప్పుడే ఎన్నికల వాతవరణం కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల రణరంగానికి సిద్దం అవుతున్నట్లుగా స్పష్టం అవుతుంది. ఇదే సమయంలో పార్టీలు మారే నాయకులు సంఖ్య కూడా ఎక్కువుగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ల నుంచి కీలకంగా ఉన్న నేత ఒకరు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్‌గా పని చేసిన శైలజానాధ్ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాంగ్రెస్ పార్టీ కీలక నేతలలో శైలజానాధ్ కూడా ఒకరు. దివంగత నేత వైఎస్ఆర్ హయంలో యువనాయకుడుగా శైలజానాధ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఇచ్చిన అండతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారాయన.

వైఎస్ఆర్ హయాంలో విప్‌గా.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. కానీ, కొద్ది రోజుల క్రితం శైలజానాద్ ను పీసీసీ చీఫ్‌గా తప్పించి గిడుగు రుద్రరాజుకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో, శైలజానాధ్ కొంత మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీని కారణంగానే ఆయన పార్టీ మార్పుకు సిద్దమైనట్లు సమాచారం అందుతుంది. ఆయన తొలుత టీడీపీలో చేరాలని చూసినప్పటికి కూడా రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి బాలేకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే జగన్‌తో భేటీ అయి ఆయన సమక్షంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి శైలజానాధ్ రెడీ అవుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. శైలజానాద్ వైసీపీలో చేరితే కనుక ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. గతంలో ఆయన శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాని ఇప్పుడు అక్కడ వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మవతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జగన్‌కు అత్యంత దగ్గరైన వ్యక్తులలో జొన్నలగడ్డ పద్మవతి కూడా ఒకరు కావడంతో.. మళ్లీ ఆమెకే అక్కడ టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. మరి శైలజానాద్‌ను ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!