Friday, April 26, 2024

జస్ట్ మిస్.. జగన్ వస్తున్నారని తెలిసి.. మెల్లగా జారుకున్న రఘురామకృష్ణరాజు

- Advertisement -

సినీ నటుడు కృష్ణ మృతికి సంతాపం తెలిపే సమయంలో ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకునేది. వైసీపీ వివాస్పద ఎంపీ రఘురామకృష్ణరాజు , వైసీపీ అధినేత జగన్ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు.. ఎదురుపడే సంఘటన జస్ట్ కొన్ని సెకన్లలలో మిస్ అయిందని అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి నివాళులు అర్పించడానికి రఘురామకృష్ణరాజు అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కూడా అక్కడకు వస్తున్నారని తెలుసుకున్న ఆయన.. అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. జస్ట్ కొన్ని సెకన్ల ముందే రఘురామకృష్ణరాజు అక్కడ నుంచి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్ష్యాలు తెలిపారు. జగన్ వస్తున్నారని రఘురామకృష్ణరాజు వెళ్లిపోయారో లేక యాధృచ్చికంగా వెళ్లిపోయారో తెలియడం లేదు.. కాని సరిగ్గా జగన్ వచ్చే ముందే రఘురామకృష్ణరాజు అక్కడ నుంచి వెళ్లిపోయినట్లుగా వీడియోలో కనిపిస్తుంది.

అయితే వీరిద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదా అని అందరు కూడా చర్చించుకుంటున్నారు. జగన్ వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడే ఉండి ఉంటే వీరిద్దరి మధ్య మాటలు చోటు చేసుకునేవా.. మర్యాదపూర్వకంగా అయినా నమస్కరించుకోవడం చేసేవారా.. చేస్తే ముందు ఎవరు చేసేవారు.. లేదంటే ఎవరు పలకరించేవారు వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లేకపోతే అసలు ఎవరికి వారు పట్టించుకోనట్టు ఉండిపోయేవారా అనేదానిపై కూడా నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో గెలిచిన అతి కొద్ది రోజులకే రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి దూరం అయ్యారు. పార్టీకి దూరం అయిన నాటి నుంచి కూడా జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారాయన. ఎల్లో మీడియాతో చేతులు కలిపి నిత్యం జగన్ మీద కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

జగన్ బెయిల్ రద్దు చేయలంటూ..ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారాయన. ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా రఘురామకృష్ణరాజు మీద రాజ్య ద్రోహం కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న రఘురామకృష్ణరాజు ఢిల్లీలోనే తన మకాం పెట్టారు. కృష్ణంరాజు చనిపోయినప్పుడు హైదరాబాద్ వచ్చిన రఘురామకృష్ణరాజు.. మళ్లీ ఇప్పుడు హీరో కృష్ణ చనిపోయినప్పుడు హైదరాబాద్‌కు రావడం జరిగింది. ఇదే సమయంలో జగన్ కూడా అక్కడకు చేరుతున్నారనే విషయం తెలియడంతోనే రఘురామకృష్ణరాజు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి దీనిపై రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!