Friday, June 21, 2024

రూటు మార్చిన కేవీపీ ..తొలిసారి జగన్‌పై అలాంటి కామెంట్స్

- Advertisement -

కేవీపీ రామచంద్రరావు పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు పోటీ చేయనప్పటికి కూడా .. పెద్దలకు సభకు పలుమార్లు ఎంపికైన అనుభవం కేవీపీకి ఉంది. అసలు కేవీపీని రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే దివంగత నేత వైఎస్ఆర్. వైఎస్‌ఆర్ తెలిసిన ప్రతి ఒక్కరికి కేవీపీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వైఎస్‌ఆర్ అంటే కేవీపీ .. కేవీపీ అంటే వైఎస్‌ఆర్. వీరి మధ్య స్నేహం రాజకీయాలకు అతీతంగా సాగింది. 1990లో వైఎస్‌ఆర్ మాస్ లీడర్‌గా ఎదుగుతున్న రోజులవి. రాయలసీమలో ఎవరికైనా టిక్కెట్ కేటాయించాలి అంటే అది వైఎస్‌ఆర్ అనుమతితోనే జరిగేది. వైఎస్‌ఆర్‌ను కలవడానికి చాలామంది నాయకులు క్యూ కట్టేవారు.

వైఎస్‌ఆర్‌ను కలవాలంటే ముందుగా కేవీపీని కలిసి వెళ్లాల్సిందే. వైఎస్‌ఆర్‌ కూడా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకొమ్మని కేవీపీకే చెప్పేవారు. తరువాత కేవీపీని వైఎస్‌ఆర్ రాజ్యసభకు పంపించి తన స్నేహన్ని చాటుకున్నారు. కేవీపీ తన ఆత్మ అని వైఎస్‌ఆర్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.వైఎస్‌ఆర్ హఠాత్తు మరణంతో కేవీపీ రాజకీయాల్లో ఒంటరైయ్యారు. వైఎస్‌ఆర్ ఇచ్చిన రాజకీయ పరిచియాలతో మొన్నటి వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా పూర్తి అయింది. అయితే వైఎస్‌ఆర్ తనయుడు జగన్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటికి వచ్చి తన తండ్రి పేరు మీద రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చాలామంది వైఎస్‌ఆర్ అభిమాన నాయకులు ఆ పార్టీలో చేరారు. అందరితో పాటే కేవీపీ కూడా వైసీపీలోకి వస్తారని చాలామంది భావించారు. కాని ఆయన వైసీపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. వైఎస్ఆర్ మరణం తరువాత వారి ఫ్యామిలీతో కొంత గ్యాప్ మెయిన్‌టైన్ చేస్తున్నారాయన.

అయితే జగన్ సీఎం అయిన తరువాత ఎప్పుడు మాట్లాడని కేవీపీ తొలిసారి .. ఆయన పాలనకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై తొలిసారి కేవీపీ విమర్శల చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై మొదటి నుంచి కూడా కేవీపీ పోరాటాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించే జగన్ సర్కార్‌ను సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతుంది..ఇప్పటికీ పోలవరం పూర్తి కాలేదు. అది ఎంత శాతం అయిందో క్లారిటీ లేదు. అటు భూ నిర్వాసితులని ఆదుకోలేదు. తాజాగా దీనిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన.పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్‌ పాలన ఉందని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టం మేరకు కేంద్రమే నిర్మించాలని, పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్‌ దారి చూపడం లేదని, కనీసం వారికి ప్యాకేజ్ అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. అయితే ఇంతకాలం కేవీపీ…జగన్‌ని పెద్దగా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే అటు వైసీపీ నుంచి మాత్రం కేవీపీని టార్గెట్ చేస్తూ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. తొలిసారి జగన్ మీద కేవీపీ విమర్శలు చేయడంపై అటు వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!