Thursday, November 7, 2024

వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తోందో చెప్పిన రోజా..జగన్‌కు ప్రతికులంగా లెక్కలు

- Advertisement -

వైసీపీ కీలక నేతలలో ఆర్కే రోజా కూడా ఒకరు. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా .. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 టీడీపీ హయంలో ఎన్ని అవరోధాలు వచ్చిన కూడా ఆమె వైసీపీలోనే కొనసాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను విమర్శించడంలో రోజా ఎప్పుడు ముందుంటారు. పార్టీ కష్టకాలంలో తోడు ఉండటంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేసుకుని మరి దాడులు చేసినప్పుడు కూడా తట్టుకుని ఉండటంతో…జగన్ ఆమె‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చేవారు.

జగన్ సీఎం అయిన తరువాత రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరు భావించారు. కాని సామాజిక సమీకరణాల్లో భాగంగా..రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. కాని రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవిని అప్పగించారు. రోజాకు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా మంత్రి రోజా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే స్థానాలను ఆమె తెలపడం జరిగింది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో వెల్లడించారు.

ప్రజల తరుఫున ప్రతిపక్ష పార్టీలు పోరాడటంలో ఫెయిల్ అయ్యాయని.. దీంతో అన్ని స్థానాలు కూడా తామే గెలుస్తామని మంత్రి రోజా తెలిపారు. ఇదే సమయంలో మొదట జగన్‌గారు తీసుకువచ్చిన సచివాలయాలు, వాలంటీర్లను తీసివేస్తామని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు జగన్ పథకాలను కొనసాగిస్తామని చెబుతున్నారని.. ఇక్కడే జగన్ సగం గెలిచినట్లు అయిందని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. కుప్పంలోనే గెలుస్తున్న తమకు మిగిలిన స్థానాల్లో గెలవడం పెద్దగా కష్టం కాకపోవచ్చని చెప్పడం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 175 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!