ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ప్రారంభం అయినట్లుగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు కావడంతో వైసీపీ శ్రేణులు .. తమ పార్టీ అధినేత పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా తల్లి వియజమ్మ కూడా జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయమ్మ…జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది.
నా భర్త, నా కొడుకు ఇద్దరు కూడా సీఎం అవ్వడం నాకు చాలా గర్వంగా ఉందని ఆమె తెలిపారు. జగన్ తన మాదిరగానే మొండి మనిషి అని.. ఏది అయిన అనుకున్నారంటే.. అది చేయాల్సిందే అని విజయమ్మ జగన్ గురించి చెప్పుకొచ్చారు. జగన్ ఎప్పుడు కూడా ఓ మాట అంటుంటాడు.. ఎంతకాలం బ్రతికాము అనేది కాదు..ఎలా బ్రతికాము అనేది ముఖ్యమని..జగన్ పాలనలో కూడా ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. జగన్‌కు 50 ఏళ్లు వచ్చాయా అని అనిపిస్తోందని.. కొడుకుకు ఎంత వయస్సు వచ్చిన తల్లి చాటు బిడ్డే అని ..విజయమ్మ వెల్లడించారు.
జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అనే ప్రశ్నకు.. 100కి 150 మార్కులు వేస్తానని విజయమ్మ చెప్పడం జరిగింది. జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో పింఛన్ నాకు బాగా నచ్చుతుందని.. 1 తేదీ కల్లా అందరి ఇళ్లకు వెళ్లి పింఛన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని.. అది ఆదివారం అయిన, పండుగ అయిన.. 1 తేదీనే పింఛన్ ఇవ్వాలనే ఆలోచన అద్బుతం అని.. అందుకే నాకు ఆ పథకం వీపరీతంగా నచ్చుతుందని విజయమ్మ వెల్లడించడం జరిగింది.
నా జీవితంలో అత్యంత బాధ కలిగించిన ఘటన అయితే.. వైఎస్ఆర్ మరణం, జగన్‌కు జైలుకు వెళ్లడం ఈ రెండు తనని బాగా బాధ కలిగించాయని విజయమ్మ చెప్పుకొచ్చారు. జగన్ , షర్మిల గురించి చెప్పమంటే.. పులి బిడ్డలు అని వ్యాఖ్యనించారు విజయమ్మ. దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.