Tuesday, May 7, 2024

సొంత జిల్లాలో ప్రక్షాళన మొదలుపెట్టిన జగన్..అవినాష్ రెడ్డికి టికెట్ లేనట్లే..?

- Advertisement -

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్లుగానే కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశం అవుతూ.. 2024 ఎన్నికలకు ఆయన రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లు కంటే.. 2024 ఎన్నికల్లో మరెన్ని సీట్లు గెలవాలనే పట్టుదలతో జగన్ కనిపిస్తున్నారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని .. పార్టీ గెలుపు కోసం ఎవరిని పణ్ణంగా పెట్టడానికి సిద్దంగా లేనని ఆయన చెప్పకనే చెప్పినట్లు అయింది.

ఎమ్మెల్యేలతో పాటు, మంత్రుల పనితీరు కూడా బాలేదని పేర్లు చదవి వినిపించడం జరిగింది. వచ్చే మార్చి నెలకల్లా వీరు తమ పనితీరును మెరుగుపర్చుకోవడానికి చివరి అవకాశం ఇస్తునని..అయినప్పటికి కూడా తీరు మారకపోతే… మీ స్థానాల్లో కొత్త వ్యక్తిని నియమిస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మార్పులకు తన జిల్లా నుంచే జగన్ శ్రీకారం చూట్టినట్టుగా కనిపిస్తోంది. 2024లో జరిగే ఎన్నికల్లో కడప జిల్లాలో భారీ మార్పులు చేయడానికి జగన్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన స్థానంలో వైఎస్ వివేకనందరెడ్డి కూతురు సునీతను రంగంలోకి దింపే యోచనలో ఉన్పట్లుగా కనిపిస్తోంది. వైఎస్ వివేకనందరెడ్డి కూతురు సునీత పోటీ చేయడానికి సిద్దంగా లేకపోతే..ఆ స్థానంలో మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా ఆలోచనలో కూడా పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. వీరెవ్వరు కాకపోతే..తన మేనమామ అయిన రవీంద్రనాధ్ రెడ్డికి కూడా ఆ సీటు ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.పార్టీ అధికారంలోకి రావాలంటే.. రాయలసీమ జిల్లాలు చాలా ముఖ్యమని జగన్‌కు తెలుసు. అందుకే… ప్రక్షాళన తన సొంత జిల్లా నుంచే మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో చాలానే మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!