Saturday, April 27, 2024

రాజకీయంగా ఏపీ సీఎం జగన్ స్నేహితుల గురించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తారీకు ఎన్నికలు, నవంబర్ 28వ తారీకు నాటికి ప్రచారం ముగించాల్సిన నేపథ్యంలో.. ఒకపక్క ఎలక్ట్రానిక్ మీడియా మరో పక్క వెబ్ మీడియాలలో మంత్రి కేటీఆర్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు గత తొమ్మిది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజానీకానికి ఏం చేసింది అనే విషయాలపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో యూట్యూబ్ లలో కూడా రకరకాల వీడియోలు చేస్తూ తాజా రాజకీయాలపై ఎన్నికలపై.. మంత్రి కేటీఆర్ కీలక విషయాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ రకంగానే ప్రముఖ యూట్యూబర్ సందీశ్ భాటియాకి కేటీఆర్ లేటెస్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దేశంలో యూట్యూబ్ లో పొలిటికల్ ఇంటర్వ్యూలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు సందీష్ భాటియా. యూట్యూబ్ లో సందీశ్ కి కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నారు. దేశంలో చాలామంది ప్రముఖ గొప్ప గొప్ప రాజకీయ నాయకులని సందీష్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ తో సందీశ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తనకున్న స్నేహబంధం గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగనన్నతో నాకు మంచి స్నేహబంధం ఉంది. మామూలుగా అయితే పొలిటికల్ గా ఆయనకు స్నేహితులు చాలా తక్కువ. దేశం మొత్తంగా చూసుకుంటే వైయస్ జగన్ కి రాజకీయంగా అత్యంత స్నేహపూరితమైన వ్యక్తి గౌతమ్ ఆదానీ అని నేను భావిస్తున్నాను. అయితే దావోస్ పర్యటనలో డిన్నర్ లో.. వైయస్ జగన్ తో కలసి దాదాపు రెండు గంటల పాటు .. సమయం గడపడం జరిగింది అని వ్యాఖ్యానించారు. ఆయనతో నాకు మంచి బాండింగ్ ఉందని కేటీఆర్ వివరించారు. ఇంకా ఇదే ఇంటర్వ్యూలో జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులను ఎలా కట్టడి చేస్తుంది..? ఇంకా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చోటు చేసుకున్న విషయాలపై.. కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఇంక జాతీయస్థాయిలో పొత్తుల గురించి.. సినిమా విషయాలు గురించి కూడా కేటీఆర్ సరదాగా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి ఇంకా ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మేలులు ఇంకా అనేక విషయాలు ఇంటర్వ్యూలో కేటీఆర్ తెలియజేశారు. సందీష్ భాటియాతో మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాజకీయ నాయకుల అందరిలో కంటే ఎక్కువగా సోషల్ మీడియాని మంత్రి కేటీఆర్ బాగా వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే గత రెండు ఎన్నికలలో చూస్తే ఈసారి సోషల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలు అప్పట్లో ఇవ్వలేదు. కానీ మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో మంచి పోటీ నెలకొంది. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ ఈ రెండిటిలో ఒకటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వస్తున్నాయి. దీంతో మంత్రి కేటీఆర్ తో పాటు కీలకమైన బీఆర్ఎస్ నాయకులు.. ప్రచారంలో బాగా కష్టపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!