రాజకీయంగా వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు అనేకమైనవి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అస్సలు ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక సవాలుతో మొదలై పెద్దపెద్ద పర్వతాలను ఢీ కొట్టి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం జరిగింది. ఈ ప్రయాణంలో మధ్యలో ఎక్కడా కూడా టెంపర్ లూస్ కాకుండా.. బ్యాలెన్సింగ్ మైండ్ తో.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా పోరాటాలు చేసి ప్రజాభిమానాన్ని సంపాదించి ప్రత్యర్ధులను ఓడించి..2019 ఎన్నికలలో చరిత్ర సృష్టించారు. భారతదేశంలో ఎవరు సాదించని ఓటింగ్ షేర్ 51%తో ముఖ్యమంత్రి అయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుని చిత్తుచిత్తుగా ఓడించి ప్రతిపక్షంలో కూర్చో పెట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు 2024 ఎన్నికలకు కూడా కరుడు గట్టిన రాజకీయ నాయకుడిగా… జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రముఖ సర్వే సంస్థలు చేస్తున్న సర్వేలలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఫలితాలు వస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అవినీతి కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నిండా అవినీతితో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితులలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేయటానికి నిర్ణయం తీసుకోవడంతో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.
ఇప్పటికే జగన్ పార్టీ నాయకులతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జరిగిన మేలను అదే వర్గాలకు చెందిన మంత్రులతో ప్రజాప్రతినిధులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుల గణనను వైసీపీ ప్రభుత్వం బయటకు తీయడం ప్రత్యర్థులకు మాస్టర్ స్ట్రోక్ లాంటిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అధికారంలోకి ఉండటంతో ఇది మరింత అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు కుల ప్రాతిపదికన రాజకీయాలు ఉంటాయి. సో జగన్ ప్రభుత్వం చేయబోతున్న కుల గణన బట్టి చూస్తే ఏఏ రకంగా ఆయా కులాలకు హామీలు ఇవ్వోచ్చు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. మరోవైపు దేశంలో కూడా కుల గణన జరగాలనే డిమాండ్ తెరపైకి రావటం జరిగింది. ఇది నిజంగా వైసిపికి కలసి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం బీసీలే ఎక్కువగా ఉన్నారు. మరి వారిలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అనేది తేలాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో కులాల డేటా ఎలా ఉంది అనేది కూడా తెలిస్తే వ్యూహాత్మకంగా ఎన్నికలలో నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాదు ఆయాచోట్ల జనాభాకు తగిన విధంగా అభ్యర్థులను ప్రకటించడానికి కూడా వీలవుతుంది. అన్ని రకాలుగా కులాలను ఆకట్టుకునే ఓట్లను పెద్ద ఎత్తున రాబట్టుకోవడానికి ఈ కుల గణన అస్త్రం వైసీపీకి ఎంతో ఉపయోగపడుతోంది. ఆల్రెడీ ఈనెల మూడవ తారీఖున జరిగిన క్యాబినెట్ సమావేశంలో కుల గణనకి ఆమోదముద్ర వేసిన వైసిపి ప్రభుత్వం ఈనెల 21 నుంచి దాన్ని చేపట్టబోతున్నారు.
స్పీడ్ గానే కేవలం రెండంటే రెండు నెలల వ్యవధిలో కుల గణన పూర్తి చేసి వాటి వివరాలను నివేదిక రూపంలో బయటపెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. డేటా మొత్తం చేతికొస్తే దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోవడానికి జగన్ 2024 అస్త్రాలు, హామీలు సిద్ధం చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికలలో గెలిచాక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు నేరుగా అందించడం జరిగింది. దీంతో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అని చెప్పుకునే బీసి ఓట్లు మొత్తం వైసీపీ వైపు మళ్ళినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో కుల గణన లెక్కలు మొత్తం చేతికి వచ్చాక తెలుగుదేశం జనసేన పొత్తులను దెబ్బతీయటానికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.