Wednesday, October 16, 2024

8 ఏళ్లలో 8 పార్టీలు మారావ్ నువ్వు అసలు లీడరే కాదు – ఉండవల్లి

- Advertisement -

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పకప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయలపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఆయన తాజాగా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణమాలపై స్పందించారు. వైజాగ్‌లో జరిగిన ఘటనలో ఇరు పార్టీలది తప్పని.. అసలు పోలీసులు రెండు పార్టీ సమావేశాలకు, బహిరంగ సభలకు ఎలా అనుమతి ఇచ్చారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరైన పద్దతి కాదని.. మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని ఉండవల్లి తెలిపారు. అక్కడ పవన్ కల్యాణ్ మీద విమర్శలు మాత్రమే చేశారని…అంతేకాని దాడులు ఏం చేయలేదు కదా అంటూ జనసైన కార్యకర్తలను ఉండవల్లి ప్రశ్నించారు.

జగన్‌ను కత్తితో పోడిచినప్పుడు ఆయన ఎలా సైలెంట్‌గా ఉన్నారో మనం అందరం చూశాం అని.. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు వారికి ఆయన హ్యాట్సాఫ్ తెలిపారు. తమ నేతను ఎవరో కత్తితో పోడిచారని తెలిసినప్పటికి కూడా వారు… ఎక్కడ కూడా పెద్దగా ఆందోళనలు చేసింది లేదని… విమర్శలను తట్టుకోలేని వార రాజకీయాల్లో పనికి రారని తన ఉద్దేశంగా పవన్‌ను ఉద్దేశించి ఉండవల్లి మాట్లాడారు. రాజకీయాల్లో ఉంటే విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ అని..అవి తట్టుకునే వారు మాత్రమే రాజకీయాల్లో సుదీర్ఘంగా రాజకీయాలను కొనసాగించగలరని ఉండవల్లి స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో పవన్ , చంద్రబాబు భేటీ గురించి కూడా ఉండవల్లి స్పందించారు. రాజకీయాల్లో ఎవరైనా పొత్తు పెట్టుకోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో చంద్రబాబు, పవన్ కలిసి పని చేశారని.. వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగానే వారు… ఈరోజున కలిసినట్లుగా కనిపిస్తుందని ఉండవల్లి తెలిపారు. అయితే భవిష్యత్తు గురించి వీరిద్దరు కూడా క్లారిటీ ఇవ్వలేదని.. ఒకవేళ కలిసి పోటీ చేసిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఉండవల్లి వ్యాఖ్యనించారు. పవన్‌కు రాజకీయ పరిజ్క్షానం తక్కవని.. ఆయనకు గైడ్ చేసే వారు సరిగా లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని ఈ మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. పవన్ జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్లు అయిందని.. ఇప్పటికే ఆయన 8 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని .. ఆయన పొత్తు పెట్టుకొంది ఒక్క వైసీపీతోనే అని ఆయన ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో లేని పార్టీతో కూడా పవన్ పొత్తు పెట్టుకున్నారంటే.. ఆయన అవివేకానికి ఇదే నిదర్శనమని ఉండవల్లి వెల్లడించారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అప్పుడే చెప్పడం కష్టమని.. ఇప్పటికే జగన్‌కే ఎడ్జ్ ఉందని ఉండవల్లి స్పష్టం చేయడం జరిగింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!