వైఎస్ జగన్ వెంట మొదటి నుంచి నడిచింది కార్యకర్తలే. జగన్ పార్టీ పెట్టిన తరువాత చాలామంది నాయకులు వచ్చి చేరి ఈ రోజు పెత్తనం చాలాయిస్తున్నారు కాని , అసలు పార్టీ రూపుదిద్దుకోకముందు నుంచే జగన్ వెంట నడించింది మాత్రం అభిమానులే . వైఎస్ మరణం తరువాత జగన్ వెంట చాలామంది నాయకులు నడుస్తారని భావించారు. కాని అలా ఏమి జరగలేదు. జగన్ వెంట మొదటి నుంచి నడిచింది అభిమానులే. జగన్ సీఎం కావాలని అభిమానులు ఎన్నో కలలు కన్నారు. మొదటి నుంచి జెండా మోసింది కార్యకర్త , అయితే ఈ రోజున ఆ కార్యకర్తకే పార్టీలో చోటు లేకుండా పోతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వేళ్తే,….
ఎన్నో ఆశలు, ఆశయాలు, అంచనాల మధ్య 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. జగన్ విజయం కోసం ప్రతి కార్యకర్త కూడా తెగ కష్టపడ్డారు. అందరు ఆశ పడినట్లుగానే జగన్ ఏపీకి సీఎం అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి తరుమారైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులు హడవిడి ఎక్కవైంది. కార్యకర్తలను పట్టించుకున్న నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. పైగా పక్క పార్టీల నుంచి వచ్చిన వారు తమపై పెత్తనం చూస్తుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు సహించలేకపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారనేది అక్షర సత్యం. ఎన్నికల సమయంలో ఎంతో హడవిడి చేసిన వైసీపీ సోషల్ మీడియా కూడా ప్రస్తుతం సైలెంట్ అయిందనే చెప్పాలి. గతంలో టీడీపీ పార్టీ ఇలానే కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదు.
దీని పరివ్యాసనమే ఆ పార్టీ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయింది. అయితే దీనిపై వైసీపీ అధినాయత్వం త్వరగానే నిద్ర లేచినట్లుంది. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్న పార్టీ అధినేత జగన్ , వారి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థలను మార్చే యోచనలో జగన్ ఉన్నారు. వీరి స్థానంలో కొందరు కార్యకర్తలకు ఎమ్మెల్యేలుగా చోటు కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే కొందరు జెడ్పీలతో పాటు, ఎంపీపీలకు కూడా ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయం నిజంగానే గర్వించదగ్గదే.
ఎందుకంటే పంచాయితీ ప్రెసిడెంట్‌ల నుంచి ఎంపీపీలు, జీడ్పీలుగా ఎదుగుతారు. కాని అక్కడ ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువుగా ఉండంటంతో..వీరంత లోకల్‌గా మిగిలిపోనున్నారు. కాని జగన్ అలాంటి వారికి కూడా ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించడానికి సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తులను ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా అవకాశం కల్పించి..వారిని చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఖచ్చింతంగా జగన్‌కే దక్కుతుంది. ఇప్పుడు డ్పీలతో పాటు, ఎంపీపీలకు కూడా ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించడంతో.. జగన్ రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేసినట్లుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జగన్ రాబోవు రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.