మాజీ హోంమంత్రి, వైసీపీ కీలక నాయకురాలు అయిన మేకతోటి సుచరిత నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనిపై పార్టీ అధినేత జగన్‌కు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు. జిల్లా బాధ్యతలను నుంచి ఆమె తప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. జగన్ కష్టకాలంలో ఆయన వెంట నడిచిన వారిలో మేకతోటి సుచరిత కూడా ఒకరు. అటు జగన్ కూడా మేకతోటి సుచరితకు తగిన ప్రాధాన్యం ఇస్తు వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించిన ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు.
మళ్లీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చోటే విజయం సాధించారామె. జగన్ తొలి క్యాబినెట్‌లో హోమంత్రిగా కూడా పదవిని అప్పగించారు. అయితే ఆ బాధ్యలను ఆమె సక్రమంగా నిర్వహించినట్లు ఎక్కడ కూడా కనిపించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సందర్భంలో ..వాటిని తిప్పి కొట్టడంలో మేకతోటి సుచరిత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. జగన్ క్యాబినెట్ పున:వ్యవస్థీకరణలో మేకతోటి సుచరిత తన పదవిని కోల్పోయారు. మంత్రి పదవి పోవడంతో ఆమె జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో పార్టీ మీద కూడా విమర్శలు చేశారు.
మేకతోటి సుచరిత పార్టీ మీద వ్యాఖ్యలపై జగన్ కూడా సీరియస్ అయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే జగన్‌తో భేటీ అయి సమస్యను పరిష్కరించుకున్నారామె. ఆ సమయంలోనే జగన్ ఆమెకు జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించారు. కాని ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆమె ఫెయిల్ అయ్యారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నప్పటికి కూడా వాటిని పరిష్కరించడానికి ఆమె చొరవ చూపించలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ సమయంలోనే జిల్లా బాధ్యతలను నుంచి ఆమె తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను అధ్యక్ష పదవికి రాజీనామాకు ప్రత్యేకంగా కారణాలు ఏవీ లేవని, తన నియోజకవర్గం పైన ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి కూడా మేకతోటి సుచరిత బయటకు వచ్చింది లేదు. పార్టీ ప్లీనరీలో కూడా పెద్దగా ఆమె కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆమె రాజకీయ జీవితం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరు అతృతగా ఎదురు చూస్తున్నారు.