Friday, March 29, 2024

రేసు రసవత్తరం…ఇప్పటికీ తేలని సెమీస్ బెర్తులు

- Advertisement -

ఎన్నడూ లేనివిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ అత్యంత ఆసక్తి కరంగా సాగుతోంది. సూపర్ 12 స్టేజ్ లో ఇంకా ఆరు మ్యాచ్ లే మిగిలి ఉన్నప్పటికీ సెమీస్ బెర్తులపై ఉత్కంఠ నెలకొంది. నాలుగు బెర్తుల కోసం 10 జట్లు రేసులో ఉండడం టోర్నీనే ఇంటరెస్టింగ్ గా మార్చేసింది. రేసులో 10 జట్లు ఉన్నా ..రెండు మూడు జట్ల కు అద్భుతాలు జరగాల్సిందే. మిగిలిన జట్లలో కొన్ని వారి వారి మ్యాచ్ ఫలితాల మీద వారి సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది.

గ్రూప్ 2 లో సౌతాఫ్రికాపై విజయాన్ని అందుకున్న పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను నిలుపుకోవడంతో పాటు రేసును మరింత ఆసక్తి కరంగా మార్చింది. ఇప్పటికే ఆ గ్రూప్ నుంచి టీమిండియా దాదాపుగా సెమీఫైనల్ ప్లేస్‌ను ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి .ఇప్పుడు పాక్ భవిష్యత్తు మళ్లీ భారత్ చేతిలోనే ఉంది. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించడమే కాదు.. నెట్ రేట్ కూడా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే టీమిండియా చివరి మ్యాచ్ లో జింబాబ్వే గెలిచి… మరోవైపు దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ భారీ విజయాన్ని నమోదు చేస్తే ఇవన్నీ జరిగితేనే పాకిస్తాన్ సెమీఫైనల్ కు చేరుతుంది. ఇన్ని సంచలనాలు జరిగే అవకాశం దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ నేపద్యంలో పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.

అటు గ్రూప్ 1 లో ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నడుస్తోంది. తమ తమ చివరి మ్యాచ్ లలో ఈ జట్లు విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ప్రస్తుతం కివీస్ మెరుగయిన పరిస్థితిలో ఉండగా..ఆస్ట్రేలియా , ఆఫ్గనిస్తాన్ పై గెలిచినా రేపటి ఇంగ్లాండ్ , శ్రీలంక మ్యాచ్ ఫలితం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద సూపర్ 12 స్టేజ్ చివరి దశకు చేరినా సెమీస్ టాలీ తెలకపోవడం ఆకట్టుకుంటోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!