Thursday, November 7, 2024

బీసీసీఐకి గుడ్ బై ..ఫారిన్ లీగ్స్ కు హాయ్ హాయ్

- Advertisement -

టీమిండియా మాజీ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సురేశ్‌ రైనా బీసీసీఐకి గుడ్ బై చెప్పాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు సైతం ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన చిన్న తలా.. బీసీసీఐ, తదితర అనుబంధ క్రికెట్‌ బోర్డులతో తెగదెంపులు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశచెందిన రైనా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీసీఐతో బంధం​ తెగిపోవడంతో రైనా ఇప్పుడు విదేశీ లీగ్స్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.విదేశీ లీగ్స్ లో ఆడాలంటే భారత్ క్రికెటర్ ఎవరయినా రిటైర్ మెంట్ ప్రకటించాలి. బీసీసీఐ పరిధిలో జరిగే ఏ క్రికెట్ ఆడేందుకు వీలుండదు. అందుకే రైనా ఇప్పుడు బీసీసీఐకి గుడ్ బై చెప్పి నో అబ్జెక్షన్ తీసుకున్నాడు.

దుబాయ్‌ వేదికగా జరగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో రైనా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ లీగ్‌లో రైనా.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు భారత్‌ అందించిన అతి గొప్ప క్రికెటర్‌ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్‌ కూడా చేసింది. కాగా, రైనా ప్రాతినిధ్యం వహించబోయే డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ తరఫున విండీస్‌ స్టార్‌ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్‌, నికోలస్‌ పూరన్‌లు ఆడుతున్నారు. ఈ లీగ్‌ ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 4 వరకు జరుగనుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!