Thursday, October 3, 2024

Bigg Boss8 :నాగమణికంఠకు సారి చెప్పిన బ్రహ్మముడి కావ్య

- Advertisement -


Bigg Boss8 : ఎట్టకేలకు బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక రంగరాజు తాను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పింది. క్షమాపణ అయితే చెప్పింది కానీ చెప్పే విధానంలో కూడా ఈమె సీరియల్ నటనను జోడించింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. బిగ్ బాస్ సీజన్ 8లో నాగ మణికంఠ అనే కంటెస్టెంట్ ఎంటరైన సంగతి తెలిసిందే. అతడు.. కన్నతల్లిని.. తండ్రిని కోల్పోయి అనాథగా ఉన్నాడు. చివరికి కట్టుకున్న భార్యకి ఏడాదిన్నర కూతురుకి దూరం అయ్యి.. డిప్రెషన్‌లో ఉండిపోయాడు. ఇక చావే శరణ్యం అనుకునే సమయంలో అతనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే అతన్ని హౌసులోకి వెళ్లిన రోజే మిగతా వాళ్లంతా టార్గెట్ చేసి.. నామినేట్ చేయడంతో.. ఎలిమినేట్ అయిపోతున్నాననే బాధలో ఏడ్చేశాడు. ఆ తరువాత నామినేషన్స్‌లో తన లైఫ్ ఎండ్ అయిపోతుందని భోరు భోరున ఏడుస్తూ.. ట్రాన్సరెంట్ గా ఉండలేనంటూ తన విగ్‌ని తీసి పక్కనపడేశాడు. నిజానికి ఏ సెలబ్రిటీ అయినా తన అందాన్ని ఇంకా ఎక్కువగా చూపించుకోవాలని చూస్తాడు. కానీ మణికంఠ.. తాను పెట్టుకున్న విగ్‌ని సడెన్‌గా తీసి పక్కనపడేసి గుండెలు పగిలేలా ఏడ్చేశాడు. అయితే అతని ఆవేదనను చాలామంది హృదయాలను కదిలించింది. మానవత్వంతో అతనికి అండగా నిలిచి.. తొలివారం ఓటింగ్‌లో అతన్ని టాప్‌లో నిలబెట్టారు. అయితే కొంతమందికి మాత్రం.. మణికంఠ విగ్ ఎపిసోడ్‌లో ట్రోలింగ్ కంటెంట్ అయ్యింది. బయట వాళ్లు ట్రోల్ చేశారంటే అనుకోవచ్చు. సొంత ఛానల్ స్టార్‌ మా సైతం… ఒక మనిషి ఎమోషన్‌కి విలువ ఇవ్వకుండా.. మణికంఠను ఇదిగో ఈ మహానటి దీపక చేత ట్రోల్ చేయించింది.

స్టార్ మాలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’షో 100వ ఎపిసోడ్ ప్రోమోలో దీపిక మణికంఠను అనుకరించింది. ఈ అమ్మాయి బదులు నేను ఉండి ఉంటే.. మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు బిగ్ బాస్ 8‌లో ఎవర్ని చూస్తే అనిపించింది అని శ్రీముఖి ప్రశ్న కంప్లీట్ కాకుండానే.. ‘నిఖిల్.. నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేను’ అంటూ విగ్ తీసి.. మణికంఠను ఇమిటేట్ చేసి అతని ఎమోషన్‌ని దారుణంగా ట్రోల్ చేసింది దీపిక అలియాస్ బ్రహ్మముడి కావ్య. అక్కడ శ్రీముఖి.. ‘ఈ అమ్మాయి బదులు’ అని అంటే.. సరిగా ప్రశ్న వినకుండానే మణికంఠ విగ్ తీయడాన్ని ఇమిటేట్ చేసింది. అయితే స్టార్ మాలోనే బిగ్ బాస్ వస్తోంది. అందులో ఉన్న కంటెస్టెంట్ తన పెయిన్‌ని చెప్పుకుని బాధపడితే దాన్ని కూడా ఈ చెత్త బ్యాచ్‌తో ట్రోలింగ్ చేయించడంతో… ఛీ ఛీ ఛీ.. రేటింగ్ కోసం ఇంత దిగజారిపోతారా? సొంత ఛానల్‌ వాళ్లే ఇలా చేస్తే.. బయట వాళ్లు ఇంకెంత ట్రోల్ చేస్తారా.? ఏ దీపికా నీకు మాత్రం బుద్దిలేదా? అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఏకిపారేశారు.

దీంతో ఈ మహానటి.. తనలోని నటనా ప్రావీణ్యాన్ని బయటకు తీసింది. తను కూడా విగ్ పెట్టుకుంటానని ఓ కట్టు కథ అల్లేసి ఓ వీడియో షేర్ చేసింది. తాను మణికంఠను ఎమోషనల్‌గా హర్ట్ చేసేందుకు చేయలేదని.. నేను కూడా విగ్ పెట్టుకుంటాను కాబట్టే.. స్టేజ్‌పై అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్.. ఆ విగ్ పీకి పక్కనపెట్టడానికి ఎన్ని టేక్‌లు తీసుకుని ఉంటుందో.. ఆ డైలాగ్‌లు ఎవరు అందిస్తారో.. అక్కడున్న వాళ్లకే కాదు.. చూసే వాళ్లకి కూడా తెలుసు. కానీ.. ఈమె మాత్రం చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ ఓ కట్టు కథ అల్లింది. పోనీ ఆమె క్షమాపణలోనూ నిజాయితీ ఉందంటే.. పళ్లు మొత్తం బయటపెట్టేసి.. చాలా కామెడీగానే క్షమాపణ చెప్పింది. దీంతో ఆమెతో అలా చౌకబారు కామెడీ చేయించిన స్టార్ మాని కూడా జనాలు ఆడేసుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!