Tuesday, October 8, 2024

Bigg Boss 8 : మరోసారి సోనియా పర్సనల్ ఎటాక్.. మళ్లీ అదే రీజన్‎తో మణికంఠ బలి

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో కొత్త చీఫ్ ను ఎన్నుకున్నారు. మూడు వారాల నుండి నిఖిలే శక్తి టీమ్ కు చీఫ్‌గా కొనసాగుతుండగా, ఇప్పుడు అతనితో పాటు సీత హౌస్‌కి కొత్త చీఫ్‌గా మారింది. కొత్త చీఫ్ ఉన్నందున మరోసారి టీమ్‌లను విభజించాలని బిగ్ బాస్ కోరారు. సోనియా, పృథ్వీ తప్ప నిఖిల్ టీమ్‌లో చేరేందుకు ఎవరూ ఇష్టపడలేదు. అందరూ సీత క్లాన్ లోకి రావాలని కోరుకున్నారు. బిగ్ బాస్ వెళ్లాలని ఆదేశించినా వాళ్లంతా సీత టీమ్‌కి వెళ్లడానికే ఇష్టపడ్డారు. చివరకు మణికంఠ, ప్రేరణ మిగిలారు. మణికంఠ కూడా సీతకు టీమ్‌లో చేరాలని ఉందని, ఆమె నాయకత్వాన్ని చూడాలని ఉందని చెప్పాడు. అప్పుడు బిగ్ బాస్ తన టీమ్ లో ఎవరితోనైనా స్వైప్ చేసుకోవాలని చీఫ్ సీతకు సూచించాడు బిగ్ బాస్. వారి ఇష్టంగా నా వద్దకు వచ్చారు ఎవరినీ చేయలేనని చెప్పడంతో.. ఇక చేసేదేం లేక మణికంఠ నిఖిల్ క్లాన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

మణికంఠ కంటే ముందునుంచే నిఖిల్ క్లాన్ లో చేరకూడదని నిర్ణయించుకున్నారు. తన బదులు ఎవరైనా నిఖిల్ టీమ్‌కి వెళితే సీత టీమ్‌లో జాయిన్ అవుతానని చెప్పినా ఎవరూ వినలేదు. దీంతో మరో మార్గం లేకపోవడంతో నిఖిల్ టీంలో చేరాల్సి వచ్చింది. మొదట సీత టీమ్‌ని ఎంచుకున్న యష్మీ.. ప్రేరణ కోసం నిఖిల్ టీమ్‌కి మారిపోయింది. అది చూసి మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంతలో, తన కూతురు తిరిగి వస్తే ఎలా ఉంటుందో నటించి చూపించాలని మణిని.. సోనియా కోరారు. మణికంఠ మాత్రం నిజంగానే తన కూతురు తన ఎదురుగా ఉందని భావించి నటించాడు. అతను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ కన్నీళ్లు రాకూడదు అంటూ మణికంఠ భావోద్వేగాన్ని జోక్‌గా మార్చారు సోనియా.

బిగ్ బాస్ సీజన్ 8లో 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని తప్పించుకోవడానికి వారు సర్వైవల్ టాస్క్‌లు ఆడాలని బిగ్ బాస్ వివరించారు. దీంతో సీత, నిఖిల్ జట్ల మధ్య పోటీ మొదలైంది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో రెండు టాస్కులు పూర్తయ్యాయి. సీత టీం మొదటి టాస్క్‌లో విజయం సాధించి, ఇంట్లోకి ప్రవేశించకుండా 12వ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది. నిఖిల్ టీమ్ ఓడిపోయినందున, అందులోని ఒక సభ్యుడు ఏ సర్వైవల్ టాస్క్‌లో ఆడకూడదు.. ఆ సభ్యుడు ఎవరనేది వారే నిర్ణయించుకోవాలి. అందరూ అనుకున్నట్టుగానే నిఖిల్ టీమ్ సభ్యులు మణికంఠను టార్గెట్ చేశారు.

మణికంఠకు శారీరకంగా బలం లేకపోవడమే కాకుండా మళ్లీ మళ్లీ అదే కారణాన్ని చూపుతూ తదుపరి టాస్కులు ఆడకుండా చేశారు. ఇలా అందుకు వాదించే ప్రయత్నం చేసినా.. అందరూ తనను టార్గెట్ చేయడంతో తానే త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ టాస్క్‌లలో తన టీమ్ ఓడిపోతే, సరిగ్గా అదే కారణంతో వారిని నామినేట్ చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే రెండో టాస్క్‌లో ఇరు జట్లు ఓడిపోయాయి. మనిషి తినలేని ఆహారాన్ని పంపించి 40 నిమిషాల్లో ముగించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఆడేందుకు నిఖిల్ టీమ్ నుంచి సోనియా, యష్మీ.. సీత టీమ్ నుంచి నబీల్, ఆదిత్య ఓం వచ్చినా కూడా ఆ టాస్క్ లో ఓడిపోయారు. కాబట్టి వారు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తొలగించలేకపోయారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!