Friday, October 4, 2024

Bigg Boss 8: మా బిడ్డను బద్నాం చేయొద్దంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సోనియా తల్లి

- Advertisement -


Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అత్యంత బలమైన కంటెస్టెంట్‌లలో సోనియా ఆకుల ఒకరు. ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్. 2019లో విడుదలైన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సోనియా.. ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన కరోనా వైరస్, ఆశ ఎన్‌కౌంటర్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాతో ఆమెకు ఆర్జీవీ కథానాయికగా గుర్తింపు వచ్చింది. ఇలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. తన నటనలో, సోనియా బిబి హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తుంది. అయితే.. మొదట్లో నిఖిల్‌తో రొమాంటిక్‌గా ఉంటూ, ఆపై పృథ్వీకి దగ్గరైంది. ఆ తర్వాత తేడా వచ్చినట్లు పుకార్లు వచ్చాయి. వారిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. తాజాగా ట్రోల్స్, కామెంట్స్ సోనియా తల్లిదండ్రులు స్పందించారు.

సోనియా తల్లిదండ్రలు మల్లీశ్వరి- చక్రపాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మా కూతురు సోనియా చాలా బాగా ఆడుతుంది. ఆమె ప్రతి టాస్కుల్లో 100పర్సెంట్ ఇస్తోంది. బిగ్ బాస్ లో తన కూతురిని టార్గెట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారని.. కానీ అందరితో ఆమె స్నేహంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సోనియా ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా.. సోనియా తల్లి బదులిస్తూ.. ‘ఆమెకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. ఇప్పటికే పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్‌లో వివాహం జరగాల్సి ఉండగా, బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో కాబోయే అత్తగారు, భార్య అనుమతితో హౌస్‌లోకి పంపాం.’ అని తెలిపారు.

సోనియా తల్లి ఇంకా మాట్లాడుతూ… ‘బిగ్ బాస్‌లో అంతా బాగుంది. అది గేమ్ అన్న విషయం మాకు తెలుసు. అందులో రూల్స్ ఎలా ఉంటాయో.. ఏ విధంగా వ్యవహరిస్తారో అంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఈ విషయంలో మాకు లేదా ఆమె అత్తమామలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, తన కూతుర్ని అలా చూపించేంత వరకు చుట్టుపక్కల వారు కొంత తేడాగా మాట్లాడుతున్నారు. పృద్వీ, నిఖిల్‌లతో తన కూతురు సోనియా ప్రవర్తన గురించి చెబుతూ.. వాళ్లను చిన్నోడు.. పెద్దోడు అంటే చిన్నన్న .. పెద్దన్న గా భావిస్తుందనీ, ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌసులో కూడా చెప్పింది. లైవ్ లో ఈ విషయం ప్రసారమైంది. కానీ, ఎపిసోడ్ లో రాకపోవడంతో తన కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక నిఖిల్ కూడా లైఫ్ లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో కూడా అలాంటి బంధమే ఏర్పడిందని చెప్పారు. ఓ అబ్బాయే.. ఓ అమ్మాయిని తల్లిలా భావిస్తే.. ఇక తప్పేముంది. ఈ విషయం హౌస్ లో అందరికి తెలుసు. అయితే ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, బయట వాళ్లు తన బిడ్డ తప్పుగా కనిపిస్తుంది. త్వరలో మ్యారేజ్ కాబోయే అమ్మాయిపై ఇలాంటి బద్నాం చేయొద్దు. లేని వాటిని ఉన్నట్టు చూపించడం సరికాదు. గేమ్ గేమ్ లాగా చూడాలి. ఇప్పటికి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లో ఎవరిని చేయని టార్గెట్ సోనియాను చేస్తున్నారు. తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ సోనియా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. .

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!