Sunday, October 13, 2024

Bigg Boss 8 : వాళ్లేం జ్ఞానులు కాదు.. నేనేం అజ్ఞానిని కాదు..బయటకు వచ్చినా తగ్గని అభయ్

- Advertisement -


Bigg Boss 8 : బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. గతంలో ఏ సీజన్ సాధించని టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య‌వంతంగా మూడో వారం పూర్తి చేసుకుంది. ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో అభయ్ నవీన్ కచ్చితంగా ఉంటాడని బిగ్ బాస్ ప్రేమికులు భావించారు. అయితే బిగ్ బాస్ పై వేసిన కుళ్లు జోకుల వల్లే ఎలిమినేట్ అయ్యాడని చాలా మంది బిగ్ బాస్ అభిమానులు అనుకుంటున్నారు. అలాగే.. చీఫ్ గా ఎన్నికైన తర్వాత అభయ్ ఆట తీరులో చాలా మార్పులు వచ్చాయని కూడా కామెంట్స్ వచ్చాయి. ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్ల గురించి మాట్లాడటానికి అభయ్ నవీన్ బిగ్ బాస్ బజ్‌కి వెళ్లాడు. ఇతర కంటెస్టెంట్స్‌పై తన అసలు అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభంలో.. బెలూన్స్ రో కనిపిస్తుంది. ఆ బెలూన్లపై కంటెస్టెంట్ల ఫోటోలు అతికించారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ ఒక్కో బెలూన్‌ను పగలగొట్టడం ద్వారా తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పాలని ప్రశ్నించాడు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన అభయ్ ముందుగా సోనియా ఫోటో ఉన్న బెలూన్‌ను పేల్చాడు. అభయ్ నవీన్ ఆమె గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు, ‘ఆమె అన్నీ నాకే తెలుసునని ఫీల్ అవుతుంది’ అంటూ తన ఒపీనియన్ చెబుతాడు. దీనిపై హోస్ట్ అర్జున్ స్పందిస్తూ.. ‘ఆమెలోని లాయర్ అప్పుడప్పుడు బయటకు వస్తుంటుందా? ‘ అని అడుగుతాడు. అప్పుడప్పుడు కాదు చాలా సార్లు అంటూ అభయ్ క్లారిటీ ఇచ్చారు.

ఆ తర్వాత కిర్రాక్ సీత బెలూన్‌ను పగలగొట్టి, ‘ఆమె చాలా ఎమోషనల్‌.. ఈ ఒక్క విషయం కాకుండా.. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది.. కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్’ అని చెప్పాడు. ఆ తర్వాత యాంకర్ విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ‘తాను స్ట్రాంగా.. వీకా తనే తనకే తెలియదు’ అంటూ అభయ్ తన పై సెటైరికల్ ఒపీనియన్ ఇచ్చాడు. నెక్ట్ యష్మీ గురించి మాట్లాడుతూ.. ‘ఆమె గేమ్ జోన్‌లోనే ఆడాలని అనుకుంటుంది కానీ ఆడదు.’ అని చెప్పారు. ఆ తర్వాత పృథ్వీ బెలూన్‌ను పగలగొట్టి, ‘అతను కొన్ని విషయాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడు’ అని చెప్పాడు. నిఖిల్ గురించి చెబుతూ… ఫైనల్లో అతడ్ని చూడాలని ఉంది అని అభయ్ తన కోరికను వెల్లడించాడు. ఆ తర్వాత బెలూన్ పగలగొట్టిన నాగమణికంఠ.. ‘మగ చంద్రముఖీ.. ఎప్పుడు ఎలా మారతాడో తెలియదు. ఇలాంటి క్యారెక్టర్‌ని ఇప్పటి వరకు చూడలేదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ అసలు షో స్టార్ట్ చేశాడు. ‘కాన్ఫిడెన్స్‌ థ్రిల్స్‌.. ఓవర్‌ కాన్ఫిడెంట్‌ కిల్స్‌’ అంటూ అతని ఆట తీరు గురించి అడగడం మొదలుపెట్టారు. ‘కొన్నిసార్లు అది నెగిటివ్ అవుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది’ అని అభయ్ బదులిచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడలేదని సూటిగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఎగ్స్ టాస్క్ గురించి మాట్లాడాడు అభయ్. ఇప్పడు ఇలా జ్ఞానిలా మాట్లాడుతున్నావ్.. కానీ లాస్ట్ త్రి డేస్ బిగ్ బాస్ గురించి ఎందుకు పులిష్ గా మాట్లాడావ్ అంటూ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ సాలిడ్ క్వశ్చన్ అడగాడు. బిగ్ బాస్ గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించి అభయ్ మాట్లాడుతూ.. ‘లోపల ఉన్నవాళ్లు జ్ఞానులు కాదు. నేను అజ్ఞాని కాదు’ అని బదులిచ్చాడు. వెంటనే స్పందించిన అర్జున్, ‘ఆడకుండా ఉండడం నీ స్ట్రాటజీనా? బిగ్ బాస్‌ను తిట్టడం నీ స్ట్రాటజీనా’ అభయ్ అన్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!