Bigg Boss 8 : బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ కాస్త ఆసక్తికరంగా సాగుతోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో సోనియా తన గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తన గైడెన్స్ లేకపోతే హౌసులో ఎవరూ టాస్కలు ఎవరూ సరిగా ఆడలేరని ఆమె భావిస్తుంది. దానికి ప్రధాన ఉదాహరణ.. ఎవరో ఒకరి పేరు చెప్పి తన గైడెన్స్ వాళ్లకి కావాలంటూ తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది అంటూ తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు సోనియా హౌసులో పృథ్వీకి, అభయ్ కి, నిఖిల్ కి గైడెన్స్ ఇచ్చింది. ఆ ముగ్గురు ఇంక నీ గైడెన్స్ చాలు అని దూరం జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా నాగ మణికంఠకు తన గైడెన్స్ అవసరం ఉందని సోనియా చెప్పడం కాస్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇది తనకు ఎంత ప్రమాదం అనేది ఆమె అర్థం చేసుకోవడం లేదు.
బిగ్ బాస్ కి వస్తున్నారు అంటేనే ఎవరి ఆట వాళ్లు ఆడేందుకే వాళ్లు హౌసులోకి వస్తారు. అలాంటిది సోనియా వచ్చి వాళ్లకు నా గైడెన్స్ కావాలి.. వీళ్లకు నా గైడెన్స్ కావాలంటూ లేని పోని విషయాల్లో వేలు పెడితే అది మొదటికే మోసం తీసుకోచ్చే ప్రమాదం లేకపోలేదు. సోనియా ఇప్పుడు అలాంటి ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. హౌసులో సోనియా ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ల గేమ్ పడిపోతుందని అందరికీ అర్థం అవుతుంది. అది ఆమె గేమ్ స్ట్రాటజీ. అది బిగ్ బాస్ హౌసులో అసలు తప్పు కాదు. ఎవరి గెలుపుకోసం వారు పావులు కదుపుతుంటారు. అలాంటి ప్రయత్నే సోనియా కూడా హౌసులో చేస్తూ ఉంది. అయితే ఎలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అనేదే అక్కడ అసలు ప్రశ్న.
సోనియా ఇప్పటి వరకు పెట్టుకున్న టార్గెట్లన్నీ కూడా అద్భుతమే. అందరూ అనుకున్నట్లే కంట్రోల్ లోనే ఉన్నట్లు కనిపించారు. కానీ, కొన్నాళ్ల తర్వాత దూరమయ్యారు. అయితే ఇప్పుడు సోనియా ఎంచుకున్న టార్గెట్ ఆమెకే మరింత తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎందుకంటే నాగ మణికంఠకు తన సపోర్ట్ కావాలి అని ఆమె రీసెంట్ గా చెప్పింది. అభయ్-మణికంఠలో ఒకరికి హార్ట్ ఒకరికి హార్ట్ బ్రేక్ అంటే… మణికి హార్ట్ ఇచ్చింది. అతడికి నా సపోర్ట్ కావాలి, నా గైడెన్స్ కావాలి అని చెప్పింది. అయితే హౌసులో ఆట గురించి పిచ్చ క్లారిటీతో ఉన్న వ్యక్తి నా గమణికంఠ అంటి అతడికి సోనియా సపోర్ట్ అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటుంది అని అనుకుంటే.. ఇలా సపోర్ట్ చేసుకుంటూ తన ఆటను గాలికి వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నాగ మణికంఠతో పెట్టుకుంటే సోనియా ఆట పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇకనైనా సోనియా తన ఆటపై దృష్టి పెట్టకపోతే కష్టమే అనే చెప్పాలి. సపోర్టు చేయడం మానేసి తమ ఆటపైనే దృష్టి పెడితే మంచిది.