Bigg Boss: హౌస్‌లో అందరూ సాఫ్ట్ గా, సౌమ్యంగా ఉంటే చూసే ప్రేక్షకులకు ఏం మజా వస్తుంది. ఇక ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్ ప్రేక్షకులను బాగా విసిగిస్తూ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. అలానే గత సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత సీజన్‌లో శోభాశెట్టి దెబ్బకు కంటెస్టెంట్లు కూడా దండాలు పెట్టేశారు. ఇక ఈ సీజన్ లో శోభాశెట్టి కూడా నా సైకోయిజం జుజుబీ అంటూ సైకోఇజం ప్రదర్శిస్తోంది కన్నడ బ్యూటీ యష్మీ. మరో కంటెస్టెంట్ పృథ్వీ.. యష్మీ తానా అంటే తందానా అనేలా తయారయ్యాడు. ఇక సోనియా కూడా నేనేం తక్కువ అన్నట్లు వారందరికీ శాడిజంలో పోటీ ఇస్తుంది… వీళ్లందరి శాడిజం చూస్తుంటే సైకోయిజం కూడా పతాకస్థాయికి చేరిందేమో అన్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల ముగిసిన ఎపిసోడ్‌లో యష్మీ సైకోయిజం తారాస్థాయికి స్థాయికి వెళ్లింది. ఇన్ని రోజులు కేవలం మాటలతో విసిగించే ఆమె.. ఇప్పుడు చేతలతో ఎక్స్ ప్రెషన్స్ తో దారుణంగా ప్రవర్తిస్తూ.. అందరినీ విసిగిస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన ఫూల్ టాస్క్ లో మణికంఠను ఆపి గేమ్ ను ఫౌల్ చేశాడు పృథ్వీ. అయితే ఇలా చేయడం సరికాదని యష్మీకి చెప్పడానికి వెళ్తే.. నా ఇష్టం ఇలాగే ఆడతాను అంటూ తల తిక్క సమాధానం చెప్పింది.
ఇక నిఖిల్ వాళ్ల లగ్జరీ రూంలోకి వెళ్లాక.. మా గేమ్ మేం ఆడుకుంటాం.. ఇలాగే ఆడుకుంటాం.. క్లారిటీ ఇవ్వం.. అంటూ యష్మీ ఘాటుగా సమాధానమిచ్చింది. అలా ఆపడం కరెక్ట్ కాదు కదా అని నిఖిల్ చాలా కూల్‌గా మాట్లాడాడు. మణికంఠ స్థానంలో నేను ఉంటే చాలా రఫ్ గా ఆడేవాడినని.. ఎవరో ఒకరి తల పగిలితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ, మనమంతా ఆర్టిస్టులం అంటూ పృథ్వీ తో నిఖిల్ చాలా కూల్ గా మాట్లాడాడు. దాంతో రెచ్చిపోయిన యష్మీ , నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కనపెట్టి నువ్వు అంటున్న దానికి మేము ఓకే చెప్పాలా? నా తల పగిలిపోతుందని నేను పక్కన కూర్చోవాలా? సెంటిమెంట్ తో మాట్లాడి మా గేమ్ ని ఆడకుండా చేయకు.. ఫిజికల్ గా మీరు ఆడాలంటే ఆడుకోండి.. లేదంటే మానేయండి.. మేము మాత్రం ఉండలేం.. మాకు ఇష్టం వచ్చినట్లు ఆడతామంటూ రెచ్చిపోయింది యష్మీ.
ఇది ఇక్కడితో ఆగలేదు. తమకు ఇంకా పాల ప్యాకెట్లు అందలేదని, యష్మీ దగ్గర నుంచి విష్ణుప్రియ పాల ప్యాకెట్ తీసుకుంటున్నానని అడిగితే వద్దు అని అంటుంది యష్మి అంటూ విష్ణు ప్రియ తెలిపింది. అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారనే కోపంతో విష్ణుకు తెలియకుండా తీసుకుంది. ఇది చూసిన యష్మీ డస్ట్ బిన్ లో ఉన్న పాల ప్యాకెట్ కవర్ తీసుకుని గొడవకు దిగింది. విష్ణు కూడా మా చికెన్ మీరు దొంగిలించారు కదా అని అడిగితే, చికెన్ తీసుకున్నట్లు రుజువు ఉందా..? ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్‌ను అడగండి అంటూ ఆమె మండిపడింది. విష్ణుప్రియ గురించి సోనియాకు చెబుతూ వెక్కిరించింది యష్మీ. అంతేకాదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి మొన్న సోనియా నిన్న యష్మీ సైకోల్లాగా మారిపోయారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి