Bigg Boss: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న షో బిగ్‌బాస్. ఎనిమిదో సీజన్ ప్రస్తుతం రెండో వారంలో ఉంది. ఇక ఇందులో భాగంగా తమదైన ఆటతో కంటెస్టెంట్లు ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. కాగా, రెండో వారంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నామినేషన్లు వేస్తున్నారు. ఈసారి మాటలు చాలా కాస్త శృతిమించాయి. ముఖ్యంగా విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ.. సోనియా వాడిన పదజాలం సరిగా లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
అసలు మ్యాటర్‌లోకి వస్తే.. రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణు ప్రియ ఇద్దరినీ సెలక్ట్ చేసుకుంది. ఆమె మొదట నాగ మణికంఠను నామినేట్ చేసి, ఆపై సోనియాను ఎంపిక చేసింది. ఇక్కడే ఇద్దరి మధ్య వాదన మొదలైంది. నిజం చెప్పాలంటే హౌసులో ఈ సమయంలో చిన్నపాటి యుద్దమే జరిగింది. సోనియా వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని నెటిజన్లు కూడా అంటున్నారు. సోనియా ఆట గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దాడికి తెగబడడమే కాకుండా నోరా.. డ్రైనేజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకూ సోనియా, విష్ణు ప్రియ ను ఏమన్నది అనే విషయం చూద్దాం.
విష్ణు ప్రియను ఉద్దేశించి సోనియా.. నువ్వు ముందు బట్టలు సరిగా వేసుకోవు. ఇక అలాంటి బట్టలతోనే వెళ్లి ఇతరుల పక్కన నిల్చుంటావు. నీవల్ల పక్క వాళ్లు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నా కూడా నువ్వు పట్టించుకోవు. నీ మాటలు, నీ చేతులకు చాలా తేడాలు ఉన్నాయి. అసలు నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్వు ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు. కానీ నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్ జోక్స్ వేయడానికి బిగ్ బాస్ షో కి పంపించారేమో అనుకుంటా. నన్ను మాత్రం అలాంటి వాటి కోసం ఇక్కడికి పిలవలేదు. గతంలో కూడా అడల్ట్ కామెడీ షో లో ఉన్నావు కదా అందుకే ఇప్పుడు నిన్ను బిగ్ బాస్ కి పిలిచారంటూ చాలా దారుణంగా సోనియా విష్ణుప్రియపై కామెంట్ చేసింది. మొత్తానికి అయితే వర్మ బ్యూటీ చేసిన ఈ కామెంట్లకు అభిమానులే కాదు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు హోస్ట్ నాగార్జున కూడా సోనియా కామెంట్స్ పై గట్టిగా హెచ్చరించాలని చెబుతున్నారు. మరికొంతమంది ఏకంగా సోనియాను ఎలిమినేట్ చేసేయండి.. హౌస్ వాతావరణం ఆమె పాడు చేస్తుది. ఇలాంటి డ్రైనేజ్ హౌస్ లో వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక రెండో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన కుటుంబ సభ్యుల విషయానికొస్తే.. నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ బాషా, ఆదిత్య, విష్ణు ప్రియ, పృథ్వీ కూడా నామినేట్ అయ్యారు.