Bigg Boss 8 : బిగ్ బాస్ 8 నాలుగో వారం వచ్చేసింది. ఈ వారం నామినేషన్లు పూర్తయ్యాయి. కొత్త చీఫ్‌ని కూడా ఎంపిక చేశారు. క్లాన్ల సభ్యులు కూడా ఈ రోజు ఎపిసోడ్ లో నిర్ణయించబడతారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ ముద్దుబిడ్డ కోసం ఎవరూ ఊహించని వ్యక్తిని హౌస్ నుంచి పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ హౌసులోకి మొత్తం 14మంది కంటెస్టెంట్లు హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్ భాష, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈసారి నామినేషన్స్‌లో ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా, ఆదిత్య, నబీల్ ఉన్నారు. అయితే ఓటింగ్‌లో నబీల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 35 శాతం మంది ఆయన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, పృథ్వీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్నేహితులు సోనియా-పృథ్వీ డేంజర్ జోన్‌లో ఉన్నారు.
ప్రస్తుతం నిఖిల్ చీఫ్ గా ఉన్న క్లాన్ లోనే పృథ్వీ-సోనియా ఉన్నారు. వీరిద్దరూ గొడవలు పడటం దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నింటిలోనూ తోటి హౌస్ మేట్స్ కు మంచి పోటీ ఇస్తున్నారు.. అలాగే సోనియా ఎన్ని తప్పులు చేసినా ఎపిసోడ్ లో చూపించడం లేదు. అంటే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోనే ఉంచాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. దీంతో లీస్టులో ఉన్నప్పటికీ సోనియా ఫ్రెండ్ కావడంతో పృథ్వీని పంపిస్తాడా అన్నది అనుమానమే.
ఇదంతా చూస్తుంటే ఈసారి ఆదిత్య ఓం పై వేటు పడనుందని తెలుస్తోంది. ఎందుకంటే అతను ఇంట్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇప్పటికీ ఇతరులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. మరి ఈ వారం బిగ్ బాస్.. ఓటింగ్ ముగిశాక పృథ్వీ, సోనియాలో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా.. ఆదిత్య బలి అవుతాడా? చూడాలి.