Bigg Boss8 :”సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్”లో భాగంగా నిన్నటి వరకు బిగ్ బాస్ 5 టాస్క్‌లను నిర్వహించారు. మొదటి టాస్క్.. ‘బంతిని పట్టండి.. టవర్లో పెట్టండి’. ఐదు బంతులను స్టిక్‌పై బ్యాలెన్స్ చేసి 10 నిమిషాల్లో టవర్‌లోకి విసిరేయాలని బిగ్ బాస్ ప్రకటించారు. వాటిని ఎవరు మొదట వేసిన వారే గెలుస్తారని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్‌లో కాంతారా జట్టు గెలుపొందగా.. లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలవడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నంబర్ 12ను తొలగించారు.
రెండో టాస్క్‌లో బిగ్ బాస్ ‘ఈట్ ఇట్ టు బీట్ ఇట్’ అంటూ ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా మహా థాలీని 45 నిమిషాల్లో తినేయాలని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్ లో నలుగురు కంటెస్టెంట్లు పాల్గొన్నా ఎవరూ పూర్తి చేయలేక ఓడిపోయారు. ఇక మూడో టాస్క్.. ‘పట్టుకోండి.. లేదంటే పగిలిపోతుంది’. ఈ గేమ్‌లో భాగంగా ఫ్రేమ్‌పై హ్యాండిల్‌కి కట్టిన బెలూన్‌ను 15 నిమిషాల పాటు పగలకుండా పట్టుకోవాలి. ఈ జట్టులో శక్తి క్లాన్ విజయం సాధించింది. ఇలా ఇప్పటి వరకు ఇచ్చిన మూడు టాస్క్‌లలో ఒకదానిలో కాంతారా జట్టు గెలిస్తే, రెండింటిలో శక్తి క్లాన్ విజయం సాధించింది.
సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ నాలుగో టాస్క్ ఇచ్చారు. వారు నిర్ణీత సమయంలో పజిల్ బ్లాక్‌ని ఉపయోగించి క్యూబ్ ఆకారాన్ని నిర్మించాలి.. ఒక్కొక్కరు రెండు టీమ్‌లు ఆడాలి.. ఎవరు క్యూబ్‌ను వేగంగా నిర్మిస్తారో వారు విజేత అని ప్రకటిస్తాడు బిగ్ బాస్. అయితే నిర్ణీత సమయంలో ఇరు జట్లు మ్యాచ్‌ను ముగించలేకపోయాయి. ఫలితంగా, క్యూబ్ టాస్క్‌లో ఎవరూ గెలవలేకపోతారు. వైల్డ్ కార్డు ఎంట్రీని అడ్డుకోలేకపోతారు.
కాసేపటి తర్వాత బిగ్ బాస్ అతనికి ఐదో టాస్క్ ఇచ్చారు. బీబీ ట్యూన్స్‌కు డ్యాన్స్ చేయాలి. ఈ గేమ్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మాత్రమే మిగిలారు. శక్తి టీమ్ నుంచి ఇద్దరు ఉండడంతో బిగ్ బాస్ వారిని విజేతగా ప్రకటించారు. దీంతో ప్రైజ్ మనీకి మరో లక్ష రూపాయలు వేసి.. మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపేశారు. అయితే ఎపిసోడ్ చివర్లో ‘సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్’ ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది.. మీరు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు అని బిగ్ బాస్ ప్రకటించాడు.. అంటే మిగిలిన 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇప్పటివరకు చాలా మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో చాలా మంది కన్ఫర్మ్ అయినట్లు కూడా సమాచారం. వీరిలో హరితేజ, రోహిణి, అవినాష్, నయని పావని, శోభా శెట్టి, టేస్టీ తేజ దాదాపుగా ఫైనలైజ్ అయ్యారు. రీతూ చౌదరి, కావ్య, గౌతం కృష్ణ కూడా వస్తారని అంటున్నారు. అక్టోబర్ 6న హౌస్ లోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రానున్నాయని సమాచారం. అయితే బిగ్ బాస్ చెప్పినట్టు నిజంగానే తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారా..? లేదంటే ఇందులో కూడా ట్విస్ట్ ఏమైనా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.