Friday, April 26, 2024

గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్

- Advertisement -

ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చావోరేవో పరిస్థితి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని కూడా అంటున్నారు. అందుకే జగన్‌ను ఓడించడానికి తన బలం సరిపోవదని.. తన పాత మిత్రుడు సాయం కూడా తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు బంధం మరింత బలం చేకుర్చుకుంటారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కాని వాస్తవ పరిస్థితి దీనికి విరుద్దంగా ఉంది. టీడీపీగా అండగా కొంత క్యాడర్ ఉంది. పార్టీ జెండాను మోసే కార్యకర్తలు కూడా ఉన్నారు. కాకపోతే టీడీపీని నడిపించే నాయకులు మాత్రం కనిపించడం లేదు. ఆ పార్టీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా సరిగా నాయకులు కూడా లేరని తెలుస్తోంది.

చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ప్రస్తుత తరానికి పని చేయడం లేదు. 40 ఏళ్ల క్రితం చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు ఎలా వర్క్ అవుట్ అవుతాయని టీడీపీ కార్యకర్తలే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. 2014లో ఏదో అదృష్టంతో గెలిచిన చంద్రబాబు.. 2019 ఎన్నికలు వచ్చే సరికి దారుణ ఓటమిని పార్టీకి అప్పగించారు. టీడీపీ ఓడిపోయి మూడున్నర సంవత్సరాలు కావొస్తుంది. అయినప్పటికి కూడా పార్టీలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వం మీద ఒక్క పోరాటం కూడా చేయలేకపోయిందంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు, కృష్ణాజిల్లాలలో రాజధాని మీద టీడీపీ నాయకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు.

2024 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో టీడీపీనే మెజార్టీ స్థానాలు గెలవాలని టీడీపీ భావిస్తోంది. అమరావతి తమకు బాగా కలిసి వస్తుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. కాని చంద్రబాబు ఆశలన్ని కూడా అడిఆశలు అయ్యేలా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరులో టీడీపీకి గట్టిదెబ్బ తగిలేలా ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గుంటూరులో మెజార్టీ స్థానాలు వైసీపీనే కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉందని సమాచారం అందుతుంది. రాజధాని అంశం కీలకం అయినప్పటికి కూడా గుంటూరు జిల్లాలో వైసీపీ చాలా బలంగా కనిపించడమే దీనికి కారణం. జిల్లాలో వైసీపీని కాదని టీడీపీకి ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు టీడీపీకి సరైన అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ జిల్లాలో చేదు ఫలితాలే వస్తాయని తెలుస్తోంది. మరి ఈ గడ్డు పరిస్థితి నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!