Tuesday, September 10, 2024

అభిమానులు పవన్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు.. చంద్రబాబును కాదు మాజీ జేడీ లక్ష్మీనారాయణ

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన..మళ్లీ క్రియశీల రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయడం లేదని.. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన తాజాగా టీడీపీ , జనసేనల బంధం గురించి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించడం జరిగింది.

తాజాగా జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే…వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను భావిస్తున్నట్లుగా తెలిపారాయన. ఇప్పటికే దీని గురించి చర్చలు కూడా జరిగి ఉంటాయని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారాయన. అభిమానులు పవన్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని… మరి వారు టీడీపీకి ఎలా మద్దతిస్తారో చూడాల్సి ఉందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలపడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయ్యే ఛాన్స్ ఉందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంచనా వేశారు. ఇది కుదరకపోతే చెరి రెండున్నారేళ్లు సీఎంగా అధికారం పంచుకొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇరు పార్టీల నేతలు కలిసి పని చేయటానికి నిర్ణయించిన విషయాన్ని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయితే వీరు ఈ రెండు పార్టీలు కలిసి ఎంతవరకు ముందుకు వెళ్తాయో చూడాల్సి ఉందని..2014 ఎన్నికల పరిస్థితి ఇప్పుడు లేదని.. 151 సీట్లు వచ్చిన పార్టీ మరింత బలంగా ఉందని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీని ఓడించాలంటే మరింత కష్టపడాల్సి ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి వీరు జగన్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!