Friday, April 19, 2024

చంద్రబాబు నెత్తిన మరో పిడుగు …పీతల సూజాత టీడీపీకి గుడ్ బై… ?

- Advertisement -

ములిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టాలని చూస్తున్న చంంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదని భావిస్తున్నారో లేక.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం కలుగడం లేదో అర్థం కావడం లేదు.. కాని చాలామంది టీడీపీ నాయకులు ఆ పార్టీ వీడుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీలో నాయకులుగా ఎదిగిన వారే .. ఇప్పుడు చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న రాజకీయ ఘటనలను ఉపయోగించుకోని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

మొత్తనికి రాష్ట్రంలో ఎలాగైనా మళ్లీ బలపడాలని చూస్తున్న చంద్రబాబుకు టీడీపీ మహిళ నాయకురాలు పీతల సుజాత షాకిచ్చినట్లే కనిపిస్తుంది. ఆమె కొంతకాలంగా టీడీపీ నాయకత్వం మీద అసంత‌ృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీడీపీలో మహిళల నాయకులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనేది అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ ఉన్న వాళ్ల వాయిస్‌ను వినపించడానికి చాలామంది దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలని ..గతంలో సాధినేని యామిని, దివ్యవాణి, పాలేటీ కృష్ణవేణి ఇలా టీడీపీ క్రియశీలంగా పని చేసిన మహిళ నాయకులందరు కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు.

తాజాగా పీతల సూజాత కూడా పార్టీ మీద అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తుంది. పీతల సూజాతను చంద్రబాబు లైట్ తీసుకున్నట్లు నియోజికవర్గంలో టాక్ బాగా నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశారని… ఇది ఆమెను మరింత బాధకు గురి చేసిందని సూజాత అనుచరులు తెలుపుతున్నారు. పీతల సూజాతను చంద్రబాబు మొదటి నుంచి కూడా దూరం పెడుతునే ఉన్నారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి పీతల సూజాత విజయం సాధించారు. కాని 2009 ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు చంద్రబాబు. అయిన కూడా ఆమె టీడీపీలోనే కొనసాగారు. తిరిగి 2014లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె విజయం సాధించారు. తీరా 2019 ఎన్నికల్లో మళ్లీ ఆమెకు టిక్కెట్ కేటాయించలేదు చంద్రబాబు. ఇలా పీతల సూజాత మీద చంద్రబాబు వివక్ష చూపిస్తునే ఉన్నారు.

పీతల సుజాతకు చింతలపూడి నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆమెకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మాగంటి బాబుకు ఆమెకు వర్గ విభేదాలుండంటంతో..అక్కడ ఆమెకు కాస్తా మైనస్‌గా మారిందనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల నాటికి అయిన చంద్రబాబు టిక్కెట్ ఇస్తారో లేదో అనుమానంతో టీడీపీలో కొనసాగడం కన్నా వేరే పార్టీలో చేరి… అక్కడ ఇప్పటి నుంచే టిక్కెట్ ప్రయత్నాలు మొదలుపెట్టుకోవడం మంచిదని ఆమె భావిస్తున్నారట. దీనిలో భాగంగానే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు పీతల సూజాతకు టిక్కెట్ కేటాస్తారని జిల్లా నాయకులు ఆమెకు సర్థిచెబుతున్నారని సమాచారం. ఒకవేళ టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుంటే పీతల సూజాతకు టిక్కెట్ కష్టమనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థుతుల్లో మరి పీతల సూజాత టీడీపీలోనే కొనసాగుతురా లేక.. పార్టీ మారతారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!