Wednesday, October 16, 2024

ప్రధాని మోదీ సమక్షంలోనే టీడీపీకి షాకిచ్చిన జగన్

- Advertisement -

ఏపీ సీఎం జగన్ మరోసారి తన అధిపత్యాన్ని నిరుపించుకున్నారు. అది కూడా ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన వేళ… ప్రత్యర్థులకు ఎక్కడ కూడా చోటు లేకుండా చేయడంలో విజయవంతం అయ్యారు. సాక్ష్యాత్తు మోదీ సమక్షంలోనే ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి దిమ్మతిరిగే షాకిచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే ప్రధాని మోడీ ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు శంఖుస్ధాపనలు చేయబోతున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర బీజేపీకి చోటు ఇవ్వడం లేదు. దీంతో పాటు బీజేపీకి మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న టీడీపీని కూడా దూరం పెట్టినట్లుగా కనిపిస్తుంది.

కేవలం ఈ కార్యక్రమం వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే నిర్వహిస్తుంది. ప్రధాని మోడీ సభలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. వాస్తవంగా అయితే ప్రధాని విశాఖకు వస్తున్నారు కాబట్టి..ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వనాలు పంపుతారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి ఆహ్వానాలు అందలేదు. చివరికి ప్రధాని సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సైతం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా వార్ కొనసాగుతుంది. తాజాగా ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనను కూడా దీనిని వేదిక చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన వైజాగ్ సత్తా చాటేలా ప్రధాని మోడీ సభను నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!