Tuesday, September 10, 2024

కోట్లు ఖర్చు పెట్టు ..టిక్కెట్ నీకే ఒట్టు.. టీడీపీ నాయకులకు చంద్రబాబు బంపర్ ఆఫర్

- Advertisement -

టీడీపీ నాయకులకు చంద్రబాబు బంపర్ ఆఫర్.. కోట్లు ఖర్చు పెడతావా అయితే టిక్కెట్ నీకే వచ్చేయ్

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత .. పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఏమి కూడా ఫలించడం లేదు. 2024 ఎన్నికల్లో అయిన గెలిచి మరోసారి సీఎం కావాలని ఆయన కంటున్న కలలు అన్ని కూడా కలలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి. నాయకులందరు కూడా ఏకతాటి మీదకు తీసుకురావడం చంద్రబాబుకు శక్తికి మించిన పని అవుతుంది. నాయకుల మధ్య అధిపత్య పోరు.. టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి నేతలతో ముందుకు వెళ్తే కష్టం అని చంద్రబాబు కూడా భావిస్తున్నారట.

దీనికి తోడు ఒంటరిగా వెళ్తే.. జగన్‌ను ఓడించడం అసాధ్యం అని భావిస్తున్న చంద్రబాబు.. మరోసారి పవన్ కల్యాణ్‌ను నమ్ముకున్నట్లు కనబడుతుంది. ఇప్పటికే వీరిద్దరు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా స్పష్టం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరు కలిసి పోటీ చేసిన ఆశ్చర్యపడాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు కూడా 100 సీట్లలో పోటీ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారట. కొన్ని స్థానాలను జనసేనకు కేటాయించి..మిగిలిన స్థానాలను వామపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో చంద్రబాబు ఉన్నారట. దీనిలో భాగంగానే డబ్బులు ఖర్చు పెట్టే నాయకులకే టిక్కెట్లు కేటాయించాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అధికార వైసీపీని సమర్థంగా ఎదుర్కొనాలంటే సామాజికవర్గాలను కూడా సైడ్ చేయాలన్న భావనలో ఆయన ఉన్నారు. కాసులు ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయన్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. ముందుగానే ఆర్థికంగా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి కోట్లు ఖర్చు పెట్టిన వారికే టిక్కెట్లు ఉంటాయని చంద్రబాబు ఇప్పటికే నాయకులకు సూచించారట. ముందుగానే ఎంత ఖర్చు పెడతారో చెబితేనే టిక్కెట్ ఇస్తారని టీడీపీ నాయకులకు తెలిపారట చంద్రబాబు.

ఒకవేళ పార్టీ గెలుపు కోసం బడా బాబులు రంగంలోకి దిగితే.. వారితో భారీగా ఖర్చు పెట్టించడానికి సైతం చంద్రబాబు వెనకాడటం లేదని తెలుస్తోంది.అలాంటి వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇస్తున్నారట. కోట్లు ఖర్చు పెట్టు ..టిక్కెట్ నీకే ఒట్టు అంటూ చాలా నమ్మకంగా నాయకులకు బుట్టలో వేసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉంది… తీరా కోట్లు ఖర్చు పెట్టిన తరువాత పార్టీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటా అని అటు బడా బాబులు ఇటు టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. టీడీపీ అధినేత ఆలోచన బాగానే ఉంది కాని.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తరువాత తీరా ఓడిపోతే.. వారి గురించి చంద్రబాబు ఆలోచిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానకి అయితే కోట్లు ఖర్చు పెడతావా అయితే టిక్కెట్ నీకే వచ్చేయ్ టీడీపీ నాయకులకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. మరి ఇది ఎంత వరుకు వర్క్ అవుట్ అవుతుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!