Tuesday, September 10, 2024

నారా లోకేష్‌కు ఇప్పటంలో చేదు అనుభవం.. మీ సానుభూతి మాకు అవసరం లేదన్న గ్రామస్తులు

- Advertisement -

ఇప్పటం.. అసలు ఇలాంటి గ్రామం ఒకటి ఉందని .. అక్కడ చూట్టు పక్కల ప్రజలకే సరిగా తెలియదు. ఎందుకంటే ఆ గ్రామంలో కేవలం 1500 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. అందులో ఓటు హక్కు ఉన్నవారు అయితే 1000 మందిలోపే అని లెక్కలు చెబుతున్నాయి.అలాంటి గ్రామాన్ని వివాదాల్లోకి లాగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పటంలో ఘనంగా నిర్వహించారాయన. ఇప్పటం గ్రామస్తులు కూడా పవన్‌కు రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పటం గ్రామం అభివృద్దికి 50 లక్షలు కూడా ఇస్తానని జనసేనాని హామీ ఇవ్వడం జరిగింది. ఇదింతా కూడా గత మార్చి నెలలో జరిగింది.

కాని ఇప్పటి వరకు పవన్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాన్ని అభివృద్ది చేసే క్రమంలో రోడ్డు మీదకు కట్టిన అక్రమ కట్టడాలను తొలగించడం జరిగింది. అది కూడా ఒకటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చి మరి అక్రమ కట్టడాలను ప్రభుత్వ అధికారులు తొలగించారు. దీనిపై పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఇప్పటం చేరుకున్నారు. ఆ సమయంలో చోటు చేసేకున్న గందరగోళం గురించి అందరికి తెలిసిందే.

ఇప్పుడు టీడీపీ యువకేరటం నారా లోకేష్ వంతు వచ్చింది. ఇప్పటంలో నిన్న నారా లోకేష్ పర్యటించారు. ఈ సమయంలో నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్లు కూల్చివేతపై నారా లోకేష్ ధ్వజం ఎత్తెరు. బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన క్షణంలో ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. తమ ఇళ్లను ఎవరు కూల్చలేదని.. మీ సానుభూతి మాకు అవసరం లేదని గ్రామస్తులు తెలపడంతో… షాక్ అవ్వడం నారా లోకేష్ వంతు అయింది.

అయిన ఇక్కడ ఎవరి ఇళ్లు కూల్చలేదని.. కేవలం ప్రహారీ గోడలను మాత్రమే కూల్చరని.. అది కూడా అక్రమంగా ప్రభుత్వ స్థలంలో కట్టిన వారివే అని గ్రామస్తులు మీడియా ముఖంగా చెప్పడంతో.. నారా లోకేష్ మీరు వైసీపీ వారు అనుకుంటా .. అని చెప్పి నెమ్మదిగా అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చిన వారికి పవన్ కల్యాణ్ ఆర్థిక సాయంగా లక్ష రూపాయిలు ప్రకటించారు. అయితే ఇది కూడా ఎవరికి అందలేదని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఎవరి ఇళ్లు కూల్చలేదు కాబట్టి.. ఆర్థిక సాయం ఎవరికి చేరలేదని సమాచారం. మొత్తనికి అటు జనసేన, ఇటు టీడీపీ ఇప్పటం గ్రామాన్ని తమ రాజకీయాలకు వాడుకుందాం అని స్కెచ్ వేసి.. బొక్కబొర్ల పడినట్లుగా కనుబడుతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!