Friday, July 19, 2024

ప్రశాంత్ కిషోర్ లేనిదే జగన్ విజయం సాధించలేరా..?

- Advertisement -

ఏపీలో మరోసారి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్ర బిందువుగా మారారు. ఆయన తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అటు దేశంలోను.. ఇటు రాష్ట్రంలోను సంచలనంగా మారాయి. ఆయన బీజేపీ పార్టీని ఓడించలేని నిస్సహాయస్థితిలో ఉండి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీలో జగన్‌ను, బిహార్‌లో నితీష్ కుమార్‌లను వారి లక్ష్యాలను నెరవేర్చడానికి సాయపడ్డాను అని.. వీరికి బదులు కాంగ్రెస్ పార్టీకి సాయం చేసి ఉంటే దేశంలో బీజేపీని లేకుండా చేసే పని వ్యాఖ్యనించారు. దీంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆయనపై మండిపడుతున్నారు. ఏపీలో వ్యూహాలతో కూడిన రాజకీయాలు చెల్లవని..జగన్ మ్యానియాకు నువ్వు తోడు అయ్యావు అంతే కాని.. నీకు అంత సినిమా లేదంటూ వైసీపీ శ్రేణులు ప్రశాంత్ కిషోర్‌ను ఏకిపారేస్తున్నారు.

ఇదిలా ఉంటే నిజంగానే ప్రశాంత్ కిషోర్ లేకపోతే జగన్ గెలవలేరా అనేది ఇక్కడ అసలు ప్రశ్నగా మారింది. దీనిపై విశ్లేషణలోకి వెళ్తే.. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత 2019 ఎన్నికలను జగన్ చాలా పగడ్బిందిగా ప్లాన్ చేసుకుంటు వచ్చారు. దీనిలో భాగంగానే ఎన్నికల వ్యూహాకర్త అయిన ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారాయన. అప్పటికే ఆయన మోదీని ప్రధానిగా చేయడంలో విజయం సాధించడంతో ప్రశాంత్‌ను తన పార్టీకి వ్యూహాకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకోవడంపై ప్రత్యర్థి పార్టీలు జగన్‌ను విమర్శించాయి. ముఖ్యంగా చంద్రబాబు అయితే జగన్‌తో పాటు ప్రశాంత్ కిషోర్‌పై కూడా విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు విమర్శలపై ప్రశాంత్ కిషోర్ కూడా కాస్తా ఘాటుగానే స్పదించారు. ఇక 2019లో ప్రశాంత్ కిషోర్‌ ఇచ్చిన వ్యూహాలను అనుసరించి జగన్ ఘన విజయం సాధించారు. అయితే ప్రశాంత్ కిషోర్‌ వ్యూహాలతోనే జగన్ విజయం సాధించారంటే అది ఖచ్చితంగా లేదనే చెప్పాలి.

రాష్ట్రం మొత్తం జగన్ చేపట్టిన పాదయాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ గెలుపు కోసం చాలానే కృషి చేశారు. పార్టీ గెలుపుకు సోషల్ మీడియా కూడా ఓ ఆయుధంగా మారింది. బూత్ కమిటీలు కూడా బలంగా పనిచేయడం, టీడీపీ‌పై వ్యతిరేకత, జగన్ మాస్ ఇమేజ్ ఇవ్వన్ని కలగలిసి వైసీపీ గెలుపుకు కృషి చేశాయి. అంతే కాని ప్రశాంత్ కిషోర్‌ వల్లే గెలిచారంటే..ఇంతకంటే అవివేకులు ఎవరు కూడా ఉండరు. ప్రశాంత్ కిషోర్ లేనిదే జగన్ గెలవలేడా.. అనే వాదన తెర మీదకు వచ్చింది. .. ప్రజల్లో జగన్ ప్రాభాల్యం తగ్గిపోతుందని అందుకు జగన్ ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించుతున్నారని ప్రత్యర్థులు కామెంట్స్ చేసేవారు.. నిజానికి ప్రజల్లో జగన్‌పై కొంత వ్యతిరేకత ఉందనేది ఒప్పుకోవాల్సిన విషయం.

అయినంత మాత్రనా జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. నవరత్నాలు అమలు చేయడానికి జగన్ తీసుకుంటున్న చర్యలే ఆయన్ను తిరిగి గెలిపించేలా చేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సి విషయం ఏమిటంటే జగన్ ఏ ఒక్కరినే నమ్ముకుని పార్టీని స్థాపించలేదు. ప్రశాంత్ కిషోర్‌ను కేవలం ఎన్నికల వ్యూహాకర్తగానే నియమించుకున్నారు కాని .. ఆయన్ను నమ్ముకునే పార్టీని నడపడం లేదు. మరి ఇన్ని పార్టీలకు పని చేసిన వ్యహాకర్త…తన వల్లే గెలిచారని చెప్పడం అతని అజ్ఝానానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!