Wednesday, April 17, 2024

చాలాకాలం తరువాత జగన్ గురించి మాట్లాడిన కొండా సురేఖ

- Advertisement -

జగన్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేసిన కొండా సురేఖ

కొండా సురేఖ ఈ పేరు తెలియని రాజకీయ అభిమాని ఉండరు. ముఖ్యంగా ప్రతి వైసీపీ కార్యకర్త కూడా కొండా సురేఖను అభిమానిస్తుంటారు. ఆమె భౌతికంగా వైసీపీకి దూరంగా ఉన్నారంతే అనే మాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. చాలాకాలం తరువాత కొండా సురేఖ నోటి వెంట జగన్ ప్రస్తావన వచ్చింది. అది కూడా జగన్ చేసిన పాదయాత్ర గురుంచి కావడంతో..ఆ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆమె జగన్ గురించి ఏం మాట్లాడారో తెలియలంటే.. ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. కొండ సురేఖను ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా అభిమానిస్తుంటారు. దీనికి కారణం కూడా అందరికి తెలిసే ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సమయంలో కొండా సురేఖ ఓ వెలుగు వెలిగారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ మంత్రిగా కూడా పని చేశారు. కాని మరణంతో కొండా సురేఖ రాజకీయ జీవితం కూడా అంధకారంలోకి వెళ్లినట్లు అయింది. వైఎస్ఆర్ పేరును సీబీఐలోకి చేర్చారనే కారణంతో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు కొండా సురేఖ. వైఎస్ఆర్‌ను తన సొంత అన్న కన్నా ఎక్కువుగా భావించేవారామె. అందుకే జగన్ కాంగ్రెస్ పార్టీ వీడిన కొంత కాలానికే సురేఖ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ తనయుడు వెంట నడిచారు.

వైసీపీలో చేరిన తరువాత తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న వేళలో కూడా కేసీఆర్‌ను తట్టుకుని మరి గట్టిగానే పోరాడారు కొండా సురేఖ. కాని స్వల్ప ఓట్లతో ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్ సమైఖ్య రాష్ట్రానికి కట్టుబడి ఉండటం.. కొండా సురేఖ తెలంగాణ వ్యక్తి కావడంతో వారి రాజకీయ భవిష్యత్తుపై అనుమనాలు మొదలైయ్యాయి. దీంతో చేసేది లేక వైసీపీని కొండా సురేఖ దంపతులు వీడారు. అయినప్పటికి కూడా వైఎస్ ఫ్యామిలీ మీద అదే ప్రేమతో ఉంటారు. కొండా సురేఖ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ.. ఇటీవల తెలంగాణలో తన జోడో యాత్రను కొనసాగించారు. ఈ సమయంలో జోడో యాత్ర‌లో పాల్గొన్న పూన‌మ్ కౌర్ రాహుల్ గాంధీ చేతిని పట్టుకోవడం జరిగింది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. పూన‌మ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాల‌ని ప‌ట్టుకోలేద‌ని, వేరే ఉద్దేశంతో ప‌బ్లిక్ లో ఎవ‌రైనా అమ్మాయి చేయి ప‌ట్టుకుంటారా అని కొండా సురేఖ బీజేపీ నాయకులను ప్ర‌శ్నించారు. ఇంత వ‌ర‌కు వైఎస్ఆర్, వైఎస్ జ‌గ‌న్, లాంటి వారు కూడా పాద‌యాత్ర‌లు చేశార‌ని, ఆ సమయంలో చాలామంది వారిని పట్టుకుని నడిచారని..కాని మీకు లాగా వక్ర బుద్దితో ఎవరు చూడలేదని కొండా సురేఖ బీజేపీ నాయకులను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆడ‌వాళ్ల‌ను తల్లిగా చూస్తుంద‌న్నారు. రాహుల్ చేయి ప‌ట్టుకున్న ఫోటోపై బీజేపీ చేస్తున్న విమ‌ర్శ‌లు సిగ్గుచేటన్నారామె. మొత్తనికి చాలాకాలం తరువాత కొండా సురేఖ నోటి నుంచి జగన్ ప్రస్తావన రావడంతో.. వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!