కేసుల నుంచి కడిగిన ముత్యంలా జగన్ బయటికి వస్తారు – రఘురామ కృష్ణంరాజు
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్‌పై నమోదు అయిన అక్రమాస్తుల కేసులు ఒక్కొక్కటికి తొలగిపోతున్నాయి. ఆయన సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సరైన సాక్ష్యాలు లేవని చెప్పి.. హైకోర్టు తీర్పునిస్తూ వస్తోంది. జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల్లో మొత్తం 1180 కోట్లుగా సీబీఐ ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసింది. అయితే ఇండియా సిమెంట్స్‌పై నమోదు చేసిన కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేకపోకపోవడంతో.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇండియా సిమెంట్స్ కేసులో ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. వాన్ పిక్ కంపెనీకి జగనే కేసుకు సంబంధం లేదని తెలంగాణ హైకోర్టు వాన్ పిక్ సంస్థను ఆ కేసు నుంచి కూడా తొలగించిన సంగతి అందరికి తెలిసిందే.
వాన్ పిక్ సంస్థ 854 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్కడ కూడా సీబీఐ నిరుపించలేకపోయింది. దీంతో వాన్ పిక్ సంస్థకు క్లీన్ చీట్ ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇండియా సిమెంట్స్ కేసులో ఎటువంటి క్విడ్ ప్రో కో జరగలేదని కోర్టు తేలపడంతో.. సీబీఐ కోర్టుకు షాక్ తగిలినట్లు అయింది. ఇదిలా ఉంటే వైసీపీ వివాస్పద ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్న అంశాలతో కోర్టు విభేదిస్తూ..రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. తన పిటీషన్‌ను కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వటం పైన రఘురామ స్పందించారు.
ఈ తీర్పు తాను ముందే ఊహించానని ఆయన తెలపడం జరిగింది. ఈ కేసులన్నింటిలో కూడా వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ప్రజలు భావిస్తున్నారని ..ఇందులో తనకు కూడా ఎటువంటి అనుమానం లేదని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టం అవుతున్నదన్నారు. ఇక రాజకీయ కారణాలతోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు ఈ పిటీషన్ దాఖలు చేశారని కోర్టు నమ్మడంతో..ఈ పిటీషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు.