Friday, April 19, 2024

కథ కంచికి… యనమల ఇంటికి.. సీనియర్ నేత చాప్టర్ క్లోజ్

- Advertisement -

వైసీపీ అధినేత జగన్ ఆలోచనలను, వ్యూహాలను తట్టుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల కావడం లేదు. జగన్ వ్యూహాలకు టీడీపీ కంచుకోటలు కుదేల్ అవుతున్నాయి. టీడీపీ నాయకులు జగన్‌ను విమర్శించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వరుసుగా పార్టీ నాయకులతో సమావేశాలు, సమీక్షలు, సర్వేల రిపోర్టులతో జగన్ బీజీ బీజీగా గడుపుతున్నారు. నేతల జాతకాల ఆధారంగా టిక్కెట్లు కేటాయింపు ఉంటుందని చెప్పకనే చెప్పారు జగన్. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే దానికి పూర్తి భిన్నంగా ఉంది టీడీపీ పరిస్థితి.

టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికలు చావో రేవో పరిస్థితి. ఎట్టిపరిస్థుతుల్లో మరోసారి సీఎం కావాలని చంద్రబాబు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాని వాస్తవ పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉంది. పవన్ తోడు లేకుండా టీడీపీ విజయం సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో సీనియర్ నాయకులు పార్టీకి గుదిబండగా మారారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు వల్ల టీడీపీ చాలా ఇబ్బంది పడుతుందని సమాచారం అందుతుంది. 2009లో దివంగత వైఎస్ఆర్ కొట్టిన దెబ్బకు ఆయన ప్రత్యక్ష రాజకీయల నుంచి దూరం అయ్యారు. కాని పరోక్షంగా టీడీపీ నుంచి పదవులు పొందుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వైఎస్ఆర్ తనయుడు జగన్ పనుతున్న వ్యూహాంలో తన కుటుంబమే రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.

టీడీపీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకం.దీనిలో భాగంగానే గత ఎన్నికలలో వరుసగా ఓడిపోయిన నాయకులకు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పారు. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఒకప్పుడు యనమల రామకృష్ణుడుదే హవా. కాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ..యనమల రామకృష్ణుడు రాజకీయం మరుగునపడిపోయింది. తుని నుంచి యనమల రామకృష్ణుడు తమ్ముడు య‌న‌మ‌ల కృష్ణుడు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో అక్కడి నుంచి ఆయన తమ్ముడు కృష్ణుడు ఓటమిపాలవడంతో అధిష్టానం సీటిచ్చే విషయంలో పునరాలోచన చేస్తోంది. యనమల పట్ల చంద్రబాబు సానుకూల వైఖరితో ఉన్నప్పటికీ నారా లోకేష్ మాత్రం అందుకు వ్యతిరేక వైఖరితో ఉన్నారు. పైగా తుని నుంచి దాడిశెట్టి రాజా వైసీపీ తరుఫున బరిలోకి దిగడం ..ఆయన ప్రస్తుతం మంత్రి కూడా ఉండటంతో..దాడిశెట్టి రాజాను ఎదుర్కొవడం య‌న‌మ‌ల కృష్ణుడు వల్ల కాదని టీడీపీ అధిష్టానం చెప్పడం విశేషం. తునిలో చంద్రబాబు దృష్టిలో ఒకరున్నారని, కానీ ఇప్పుడే ప్రకటించరని పార్టీలోని కొందరుచెబుతున్నారు. మొత్తనికి ఒకప్పుడు జిల్లాలో అన్ని తానై చక్రం నడిపిన యనమల ఇప్పుడు టిక్కెట్ కోసం ఇలా ఎదురు చూడటం చాలా బాధాకరంగా మారిందని పార్టీ శ్రేణులే వాపోతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!