Andrapradesh: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి భాజపాతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడే మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకొంటున్నారని పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని, అయినా సరే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం పట్ల జనసేన నేతలు మరియు కార్యకర్తలు అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గ్రౌండ్ లెవెల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆధిపత్యం చలాయిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒక్క పిఠాపురంలో మాత్రమే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాంటి సాహసం చేయడం లేదని తెలుస్తోంది. అణిగిమణిగి ఉండేలా అయితే ఇక కలిసి సమానంగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు నాయుడు ఇలాగే ఆయన అవసరాలకి అందరినీ వాడుకొని వదిలేస్తారని పవన్ కళ్యాణ్ ని కూడా అలాగే అవసరం ఉన్నంత వరకు వాడుకొని అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చంద్రబాబు నాయుడు అసలు రూపం గుర్తించి కూటమి ప్రభుత్వంలో నుంచి బయటికి వచ్చి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన శ్రేయోభిలాషులు చర్చి౦చుకు౦టున్నట్లు సమాచారం. ఇటీవల మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నేత ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో జనసేన పార్టీకి సంబంధించి ఫోటోలు కానీ పార్టీ గుర్తు కానీ లేకపోవడంతో ఇరు పార్టీ వర్గాల మధ్యలో ఘర్షణ మొదలయినట్లు సమాచారం. తమని పక్కన పెట్టేశారని ఆగ్రహించిన జనసేన నేతలు ఆ ఫ్లెక్సీని చి౦పి వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నేతల ఇళ్ళ పైన దాడి చేసినట్లు సమాచారం. ఆ తరువాత ఇరు పార్టీ పెద్దలు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసి వివాదాన్ని ముగించినట్లు తెలుస్తోంది.
అసలు పవన్ కళ్యాణ్ ఏ ప్రయోజనాల కోసం చంద్రబాబు దగ్గర ఇంత అణిగిమణిగి ఉంటున్నారో ఆయనకే తెలియాలని తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కూటమిలో చీలిక మొదలైందని ముందు ముందు ఇది మరింత పెరిగి వారు విడిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.