Amithsha:రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ నేపధ్యంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన బాంబు పేల్చారు. ఆయన పేల్చిన బాంబు ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్కంఠకు దారి తీస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ముగ్గురు జత కడితే కానీ జగన్ ని ఓడించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఏదైతే ఏం జగన్ ని ఓడించి అధికారం అయితే చేపట్టారు. కానీ వీరు అధికారంలో ఎంత వరకు ఉంటారు 2029 లోపే రాష్ట్రంలో ఏదైనా జరగనుందా అనే ప్రశ్న ప్రజల్లో లేకపోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అమిత్ షా గారు ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఒకటే దేశం ఒకటే ఎన్నికలు విధానంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు వస్తాయని ఒకేసారి దేశవ్యాప్తంగా అటు అసెంబ్లీకి మరియు ఇటు లోక్ సభ స్థానాలకి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి రకరకాల అధ్యయనాలు కూడా చేసిందని తెలిపారు. తాజాగా ఈ అధ్యయనాలు ఒక కొలిక్కి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఎన్డీయే 3.౦ లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఒక ఉన్నత స్థాయి అధికారి మీడియాకి తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ధారించారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తేల్చి చెప్పేశారు.
కేంద్ర ప్రభుత్వం తరపున ఒక కీలకమైన నాయకుడు జమిలీ ఎన్నికల గురించి సానుకూలంగా మాట్లాడటం ఇదే మొదటి సారి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా 2027 లోపే నిర్వహించే ఆస్కారం ఉంది. మోడీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తోటి మంత్రులు అశ్విన్ వైష్ణవ్ మరియు ప్రహ్లాద్ జోషితో కలిసి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ 100 రోజుల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు అమలు చేసిన పథకాల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా నోట ఈ మాటలు వచ్చాయి. ఈ సంద్రభంగా జమిలీ ఎన్నికల గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకి ఆయన పైవిధంగా స్పందించారు. తమ హయాంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇదే జరిగితే గనుక త్వరలోనే ఏపీలో మళ్ళీ ఎన్నికలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.