Chandrababu- Pawan: ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వివాదం పెద్ద ఇష్యూ కాదు ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి అది రొటీనే. కానీ పవన్ పోయి పోయి అస్సలు తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేసారు. అది నూటికి నూరు శాతం బౌన్స్ బ్యాక్ అయింది. అదే టైమ్ లో కార్తీ చాలా గౌరవంగా, సంస్కారవంతంగా, సున్నితంగా క్షమాపణ చెప్పారు. డ్యామేజ్ జరుగుతోందని పవన్ కు అర్థం అయింది. మూడు లైన్లలో కార్తీ సమాధానం ఇస్తే, పవన్ దాదాపు ముఫై లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. తమిళనాడు జనాలు పవన్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు. పవన్ కు ఏం అర్హత ఉ౦దనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు. ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటకు రావడం మొదలయ్యింది. తనని baaptize చేశారని, జెరూసలెం వెళ్లానని, తన పిల్లలు క్రిస్టియన్లని ఆ మతంలో ఎంతో కొంత మంచి వుండడం వల్లే ఎంతో మంది అటు ఆకర్షితులు అవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకు వచ్చాయి. జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా? అనే పాయింట్ తీసారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్ కు తొలిసారి చుక్కెదురు అయింది. లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది పక్కకు పోయింది. తాను హిందూత్వ ఐకాన్ అనేలా పవన్ ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నది ఇష్యూగా మారిపోయింది. మొత్తం మీద గతంలో మాదిరిగా జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని, తాము ఏం చేసినా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదని, అది ఇప్పుడు పవన్ కు తెలిసి వచ్చే ఉంటుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.
ఇదే టైమ్ లో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్ట్ లు ప్రకటించారు. వాళ్ల దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం, జనసేన, భాజపాలకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు, కొంతమంది తెలిసిన వారు వున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు దొరకని వారు వున్నారు. ఇప్పుడు రెండు విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి పదవులు అందుకున్న చాలా మంది ఈ పదవులు తమ లెవెల్ కు సరిపడినవి కాదని ఫీలవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లు కనిపిస్తున్నాయి. మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏమిటని, అయిదేళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారని వాళ్ళ౦దరినీ పక్కన పెట్టారని వాళ్లకి ఇవ్వలేదు అంటూ కూటమి నాయకులు అసంతృప్తి వ్యక్త పరిచారు. దీంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. పదవులు చాలా ఉన్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది. మరో వైపు పవన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారని పవన్ కి ఎంత చెప్పినా వినకుండా ఆయనకి నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారని కూటమి అంతర్గత వర్గాల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మధ్యలో చీలిక మొదలైందా అనే ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి.