Tuesday, October 8, 2024

BRS: ఆ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కానీ..పీఏసీ చైర్మన్ ఎంపిక వెనుక అదే వ్యూహం

- Advertisement -

BRS: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం అనుసరిస్తొందా? అందులో భాగమే అరికపూడి గాంధీ పీఏసీ చైర్మన్ ఎంపికా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించి ఎంపిక చేసినట్టు స్పీకర్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? మిగతా 9 మందిని అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ. కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో నాలుగు వారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో ఈ వ్యవహారంపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది.

హైకోర్టు ఆదేశంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి..స్పీకర్ అసలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.ఒక వైపు హైకోర్టు ఆదేశించిన సమయంలోనే మరో పక్క స్పీకర్ ప్రసాద్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ ఎంపిక నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు..దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఉంది.కచ్చితంగా ఇందులో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం ఉందన్న టాక్ నడుస్తోంది. న్యాయనిపుణుల సలహాతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలపై అనర్హత కేసులను స్టడీ చేసినట్టు తెలుస్తోంది.

అయితే వ్యూహాత్మక ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎంపిక సాగినట్టు తెలుస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ ఛైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఐతే మరి మిగితా 9 మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లా..లేక కాంగ్రెస్ వాళ్లా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా..అనే సందేహం అందరిలో మెదులుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్తా రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత కొద్ది నెలలుగా కనిపించని కొత్త వాదనను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజక అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి, మంత్రులను కలిశారు తప్పా వారు కాంగ్రెస్ లో చేరలేదనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకీ దూరంగా ఉంటున్నారనే కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చింది. ఈ పరిణామం ఒకింత బీఆర్ఎస్ కు షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు. అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే అరికపూడి గాంధీనీ పీఏసీ ఛైర్మన్ గా నియమించినట్టు తెలుస్తోంది. అందుకే నేరుగా ఆయనతో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమేనని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ ఎటు వెళుతుందో చూడాలి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!