Tuesday, October 8, 2024

YSRCP: వైసీపీని మరింత నీరుగార్చే ప్రయత్నం.. గంటా షాకింగ్ కామెంట్స్

- Advertisement -

YSRCP: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి అనంతరం కొందరు ప్రముఖ నేతలే వలస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ప్రక్షాళన ఇప్పుడు ఎంతో ముఖ్యమనే మాటలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఎన్నికల్లో విజయంతో అధికారాన్ని చేపట్టిన టీడీపీ కూటమి కొందరు వైసీపీ నాయకులతో రహస్యంగా టచ్‌లో ఉంటున్నట్లు, కొందరు బడా నేతలను లాక్కుని వైసీపీని పూర్తిగా కనుమరుగయ్యేలా చేయాలని పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల కొందరు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మరింత అనుమానాలను పెంచుతున్నాయి. వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరితో విసిగిపోయారని, వారంతా టీడీపీ ఆహ్వానిస్తే కూటమిలో చేరతారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవన్నీ పక్కన పెడితే అసలు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న విషయం గంటా ఎలా స్పష్టం చేయగలడు, అతనికి ఎలా తెలుసు అన్నదే ఇక్కడ ప్రధాన చర్చ.

2014 నుంచి 2019 కాలంలో కూడా కొందరు ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కుందనేది జగమెరిగిన సత్యం. అప్పట్లో వైసీపీకి టీడీపీకి మధ్య మార్జిన్ తక్కువగా ఉండేది. వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో కొంతమందిని లాగేసి వైసీపీని సగానికి సగం పరిమితం చేయడానికి వ్యూహాలు పన్నింది. ఇదిలా ఉంటే.. జగన్ వైపు కనీసం అరడజన్ మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడేవారు ఉండగా.. ఒకరిద్దరు వలస బాట పట్టినా వైసీపీకి పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మరి ఈ సమయంలో గంటా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!