Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 12 నిన్న రాత్రి ప్రసారమైంది. మొన్నటికి మొన్న బిగ్ బాస్ మూడు ప్రోమోలతో నేటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందన్న ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రోమోలో చూపని కొన్ని ఆసక్తికర విషయాలు కూడా హౌస్‌లో చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ అర్ధరాత్రి నిద్రలేపి నిఖిల్ క్లాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, హౌస్ మేట్స్‌కు కూడా కఠిన నిబంధనలు విధించారు. అంతే కాదు కెరటం టీం చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు నిఖిల్ క్లాన్ చేసిన తప్పేంది.. బిగ్ బాస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసుకుందాం.
నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా నిఖిల్ క్లాన్ టాస్కులో ఓడిపోవడంతో వారి రేషన్ కట్ అయిన సంగతి తెలిసిందే. కానీ హౌస్ మేట్స్ లో అందరూ ఒకరికి పెట్టకుండా తినడం ఏంటన్న బాధతో ఎమోషనల్ అయ్యి బిగ్ బాస్ రూల్స్ ను పక్కన పెట్టేశారు. అందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్ లో నిఖిల్ క్లాన్ తప్పులు చేస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. మణికంఠ తనతో పాటు నిఖిల్‌కు భోజనం పెట్టాడు. ఇదంతా చూసిన విష్ణు ప్రియ, నబిల్ కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిలా పాపం తలా పిడికెడ్ అన్నట్లు మణికంఠ ఒక్కడే తినకుండా సమయానికి అక్కడికి వచ్చిన నిఖిల్ కూడా తినిపించాడు. ఫలితంగా నిఖిల్ క్లాన్ ఇలా రూల్స్ బ్రేక్ చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఈ తతంగం అంతా జరగే ముందే మూడు టాస్కులు పూర్తయ్యాయి. ఒక 50,000 టాస్క్, 70,000 టాస్క్‌లలో నిఖిల్ టీమ్ గెలిచింది. ఇప్పుడు హౌస్‌లోని రూల్స్‌ను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ రేషన్‌తో పాటు నిఖిల్ టీమ్‌కి ఇచ్చిన రెండు అవకాశాలను కూడా రద్దు చేశాడు. అంతేకాదు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తుండిపోయే హౌస్ మేట్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని బిగ్ బాస్ హెచ్చరించారు. అర్ధరాత్రి నిద్రలేపి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో హౌస్ మేట్స్ అందరూ అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడం, జాలిపడి ఇతరులకు ఇవ్వకపోవడం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకానొక సమయంలో నాగ మణికంఠ వచ్చి ఆకలేస్తుందని అడగ్గా యష్మీ గౌడ టీమ్ అస్సలు పట్టించుకోలేదు. దీంతో చేసేదేం లేక మణికంఠ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు.