Thursday, November 7, 2024

Bigg Boss 8 : అభయ్ కు రెడ్ కార్డ్ చూపించిన నాగార్జున.. వేడుకున్న కరగలేదు

- Advertisement -

Bigg Boss 8 : తెలుగు టెలివిజన్ రంగంలో అనేక రకాల షోలు ప్రసారమవుతున్నాయి. కానీ, రియాల్టీ పై ఆధారపడినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. మన వాళ్లకి అస్సలు పరిచయం లేని కాన్సెప్ట్ తో వచ్చినా.. మంచి ఆదరణ పొందింది. అందుకే ఏడు రెగ్యులర్, ఒక OTT సీజన్‌లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 8వ సీజన్ కూడా అదే స్పందనతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున రెడ్ కార్డ్ తో కలకలం సృష్టించాడు. అదేంటో చూసేద్దాం. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ కాన్సెప్ట్ తో నడుస్తోంది. అందుకు తగినట్లుగానే ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపుతున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా ఈ సీజన్ లో ట్విస్ట్ లు, సర్ ప్రైజ్ లు, షాక్ లు ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. దీంతో ఈ సీజన్‌కు కూడా భారీ స్పందన వస్తోంది. భారీ అంచనాలున్న ఎనిమిదో సీజన్ మూడో వారంలో ‘ప్రభావతి 2.0’ టాస్క్ కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఇందులో నిఖిల్ క్లాన్, అభయ్ క్లాన్ ఎవరికి ఎక్కువ గుడ్లు ఉంటే వారే గెలుస్తారు. దీంతో ఇరు జట్ల సభ్యులు మరింత గుడ్ల కోసం గట్టి పోటీనే జరిగింది. ఆ టాస్కులో గుడ్ల కోసం జరిగిన పోరులో ఇల్లు రణరంగంలా మారిపోయింది. గత వారం బిగ్ బాస్ లో కొత్త రూల్స్ పై అభయ్ నవీన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో ‘నీకు బ్రెయిన్ ఉందా.. బొక్కలో డెసిషన్స్ నువ్వునూ? అసలు మీరు మనిషికే పుట్టావా? ముగ్గురు కలిసి ఇంతమందికి ఎలా వండుతారు ? దిమాక్ ఉందా నీకు’ అంటూ నోటికొచ్చినట్లు వాగేశాడు. ఆ తర్వాత కూడా అదే పద్దతిలో కొనసాగడం కనిపించింది. ‘ప్రభావతి 2.0’ టాస్క్‌లో భాగంగా జరిగిన ఫైట్స్‌పై హోస్ట్ నాగార్జున సీరియస్‌గా ఉంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ ప్రోమోలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా బిగ్ బాస్ పై అభయ్ నవీన్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూపించారు. అప్పుడు నాగార్జున రాడ్ పట్టుకుని కోపంతో ఊగిపోయాడు. బిగ్ బాస్ షోలో రూల్స్ పాటించడం లేదన్న కోపంతో అభయ్ నవీన్ పై నాగార్జున సీరియస్ అయ్యాడు. అంతేకాదు బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పాడు. మోకాళ్లపై కూర్చొని నవీన్‌ని క్షమించమని అభయ్‌ కోరాడు. అయినా నాగార్జున కనికరించలేదు. దీంతో ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!