Friday, January 24, 2025

Bigg Boss 8 : షాకింగ్.. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం హౌస్ లోకి ఏకంగా 12వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

- Advertisement -


Bigg Boss 8 : బిగ్ బాస్ నాలుగు వారం నామినేషన్ల తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారైంది. అందరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు పూర్తిగా నెగిటివిటీగా ఉన్న యష్మీకి ఇప్పుడు సపోర్ట్ పెరిగింది. నిన్నటి నామినేషన్ల ఎపిసోడ్‌లో సోనియా ప్రవర్తన పై గొడవ జరిగింది. యష్మీ నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని, తన గేమ్ ను చూడదని సోనియా చెప్పడంతో యష్మీ బోరున విలపించింది. అలాగే నబీల్ కూడా నామినేషన్లలో సోనియాకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బిగ్ బాస్ నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హౌస్‌లో మొదటి చీఫ్‌గా నిఖిల్.. రెండో చీఫ్‌గా సీత ఎంపికయ్యారు. దీంతో బిగ్ బాస్ మరోసారి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రోమోలో హౌస్ మొత్తం ఒకే మాట మీద నిల‌బడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న బలమైన కంటెస్టెంట్‌లలో నిఖిల్ ఒకరు. ఇతను శక్తి క్లాన్ చీఫ్ గా ఉండగా, సీత కాంతారా క్లాన్ జట్టుకు చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన ప్రోమోలో ఎవరెవరు ఏ క్లాన్ ఉండాలో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ సూచించారు. శక్తి క్లాన్ లో తనకు సరైన గుర్తింపు లేదని, అందుకే కాంతారా జట్టులోకి వెళ్లాలనుకుంటున్నానని విష్ణు ప్రియ చెబుతుంది. ఆ తర్వాత యథావిధిగా నిఖిల్ క్లాన్ లోకే సోనియా వెళ్లింది. నైనికా సీత టీమ్ ను ఎంచుకుంది. అలాగే పృథ్వీ కూడా నిఖిల్ టీమ్‌కి వెళ్లిపోయాడు. సీత టీమ్‌లో చేరుతున్నానని నబీల్ చెప్పాడు. ఆ తర్వాత యష్మీ మాట్లాడుతూ.. తాను ఈ ఇంట్లో ఎలాంటి బంధం, భావోద్వేగాలు పెంచుకోవడానికి రాలేదని.. యష్మీ చెబుతుంది. దీంతో పాటు తాజాగా విడుద‌లైన రెండో ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ హిస్టరీలో సరికొత్త ఘటన జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో హౌస్ లోకి 12మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని బిగ్ బాస్ చెబుతారు. వాళ్లు రాకుండా ఉండాలంటే.. వారిని అడ్డుకునే పవర్ ప్రస్తుత హౌస్ మేట్స్ చేతిలోనే ఉందని బిగ్ బాస్ చెబుతారు. ఒక్కో గేమ్ లో వారు చూపించే పవర్ సాయంతో ఒక్కో వైల్డ్ కార్డు ఎంట్రీని అడ్డుకోవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ మేకర్స్ ఈ సీజన్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!