Friday, January 24, 2025

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్‌లో కలకలం రేపుతున్న స్పెషల్ ‘గిఫ్ట్’

- Advertisement -


Bigg Boss 8: ఉత్తరాది నుంచి పరిచయమైనప్పటికీ తెలుగు బుల్లితెర చరిత్రలో ఏ షోకి రానటువంటి రెస్పాన్స్ బిగ్ బాస్ కు వస్తోంది. అందుకే వరుస సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో రికార్డులు కూడా బద్దలయ్యాయి. అలాగే ఇటీవల ఎనిమిదో సీజన్‌ను మేకర్స్ షురూ చేశారు. ఎన్నో అంచనాల నడుమ స్టార్ట్ అయిన షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో షోపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బిగ్ బాస్ బిగ్ మిస్టేక్ బ‌య‌టికి వ‌చ్చింది. అందేంటో మీరు చూడండి! ఒక రకమైన టాస్క్‌లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాక్‌లు, ఫైటింగ్‌లు వీటన్నింటితో మునుపటి సీజన్లు అన్నీ కూడా ఒకే పద్ధతిలో నడుస్తున్నట్లు అనిపించింది. ఈ స్థితిలో మేనేజ్‌మెంట్ ఉల్టా పల్టా అంటూ రూట్ మార్చి గత సీజన్‌ను భారీ సక్సెస్ చేసింది. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకొచ్చింది. ఇందులో ఎన్నో కొత్త కాన్సెప్ట్‌లు చూపించి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఫుల్‌గా పంచుతున్నారు.

బిగ్ బాస్ షోలో దాదాపు అన్నీ చాలా గోప్యంగా ఉంటాయి. నామినేషన్లు, ఎలిమినేషన్లు వంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా రహస్యంగా జరగాలి. కానీ, కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ నుంచి కొన్ని రహస్యలు బయటకు వస్తుంది. అందులో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లీక్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగానే నడుస్తుందని మొదటి నుంచి మేనేజ్ మెంట్ చెబుతూ వస్తోంది. కానీ, అందులో జరిగే కొన్ని విషయాలు ప్రేక్షకులకు అనుమానాలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో జరిగే కొన్ని ఎలిమినేషన్లు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కాకుండా సొంతంగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అనుమానాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ షోలోకి వచ్చే కంటెస్టెంట్లకు బయట నుంచి ఎలాంటి విషయాలు తెలియకుండా ప్లాన్ చేస్తారు. ఏదైనా ముఖ్యమైన సమాచారం అయితేనే బిగ్ బాస్ కానీ, హోస్టుగానీ వెల్లడిస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా హౌస్‌లో ఉన్న సెలెబ్రిటీలకు టైం తెలియకుండా నిర్వహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే గడియారం, వాచ్ లాంటివి లోపలికి అనుమతించరు. అతిపెద్ద విజయవంతమైన షో అయిన బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు వాచీలు ధరించడం నిషేధం. అంతెందుకు ఇంట్లోకి వచ్చే సెలబ్రిటీలు కూడా వాచీ పెట్టుకోరు. పెట్టుకున్న దాన్ని కవర్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న అభయ్ నవీన్ వాచ్ ధరించి కనిపించాడు. చాలా మంది దీనిని హైలైట్ చేస్తున్నారు. వారాంతంలో ప్రసారమైన ఎపిసోడ్‌లో, అభయ్ నవీన్ చేతికి వాచ్‌తో కనిపించాడు. దీంతో చాలా మంది ‘ఇది ఫేక్ షో’, ‘స్క్రిప్టెడ్ షో’ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. నిజానికి అభయ్‌కి ఆ వాచ్‌ని స్పెషల్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ, అతను దానిని ధరించడం షో నిబంధనలకు విరుద్ధం. ఈ విషయాన్ని బిగ్ బాస్ టీమ్ పట్టించుకోకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!