Bigg Boss 8: బిగ్ బాస్ ప్రసారం అవుతున్న అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. కొంతమంది సెలబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి ప్రేక్షకుల ఓట్లను బట్టి విజేతను నిర్ణయించడానికి విచిత్రమైన టాస్క్‌లు పెట్టడమే ఈ షో ఉద్దేశం. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులోకి ఎంటరైంది ఈ షో. దేశంలోనే హయ్యెస్ట్ టీఆర్పీ వస్తుండడంతో నిర్వాహకులు సీజన్ల మీద సీజన్లు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ మంచి సక్సెస్‌తో నడుస్తోంది. ఇందులో నాలుగో వారం ఎలిమినేషన్ కు సంబంధించిన ఓ సంచలన విషయం లీక్ అయింది. వివరాల్లోకి వెళితే… బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు ఏడు రెగ్యులర్ సీజన్‌లు, ఒక OTT సీజన్‌ను పూర్తి చేసుకుంది. కానీ, వీటన్నింటిలో చూపని కొత్త కంటెంట్ ఎనిమిదో సీజన్‌లో ప్రసారం అవుతోంది. గత సీజన్ల కంటే దీనికి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ షోకి భారీ రేటింగ్స్ వస్తున్నాయి. దీంతో నిర్వాహకులు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్‌లు ఇస్తున్నారు. కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీరిలో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం నుంచి వినోదాన్ని పంచుతోంది. అలా నాలుగో వారం కూడా నామినేషన్ల పర్వం హోరాహోరీగా సాగింది. నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికా నామినేట్ అయ్యారు. అయితే, నిఖిల్‌కి బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక శక్తితో చీఫ్ నైనికను కాపాడాడు. అలా ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. ఇటీవల ప్రసారమైన ఎనిమిదో సీజన్‌లో నాల్గవ వారం నామినేషన్లలో పేరున్న కంటెస్టెంట్లు ఎవరూ లేరు. దీంతో తన టాలెంట్ తో హైలైట్ అవుతున్న నబీల్ మొదటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ప్రస్తుతం ఓటింగ్‌లో మార్పు వచ్చింది. ఈ ప్రేరణతో టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చింది. దీంతో నబీల్ రెండో స్థానానికి పడిపోయాడు. వారిద్దరి మధ్య చిన్న తేడానే ఉంది. ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో జరిగిన ఓటింగ్‌లో ప్రేరణ, నబీల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ రెండింటి తర్వాత కూడా ఓటింగ్‌లో చెప్పుకోదగ్గ తేడా లేకుండానే వారం ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. మూడో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడు. కాబట్టి ఈ వారం ఈ మూడు స్థానాలు 100 శాతం సేఫ్ అని చెప్పొచ్చు. ఓటింగ్ జరిగిన నాలుగో వారంలో ఆదిత్య ఓం నాలుగో స్థానంలో ఉన్నారు. పృథ్వీరాజ్ శెట్టి ఐదో స్థానంలో ఉన్నాడు. సోనియా ఆకుల అందరికంటే చివర్లో అంటే ఆరో స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రకారం సోనియానే ఎలిమినేట్ చేయాల్సి ఉంది. మరి ఆమెకు మరింత కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ భావిస్తే.. పృథ్వీ, ఆదిత్యలను అనుకున్నట్లుగా ఇంటి నుంచి పంపవచ్చు