టాలీవుడ్ టాప్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. సెలబ్రీటీలతో బాలకృష్ణ చేసిన హంగామా అంత ఇంత కాదు. మహేష్ బాబు, రవితేజ , రాజమౌళి వంటి వారిని తన అన్ స్టాపబుల్ షోకి తీసుకుచ్చి .. వాళ్లను రోస్ట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది. అసలు బాలకృష్ణతో టాక్ షో చేస్తే హిట్ అవుతుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తు..అన్ స్టాపబుల్ మొదటి సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా అన్ స్టాపబుల్ రెండో సీజన్‌ను మొదలుపెట్టారు. షో నిర్వహాకులు భిన్నంగా ఆలోచించి.. సినిమా వాళ్లను కాకుండా.. రాజకీయ నేతను పిలిచి .. అందరి చూపు షోవైపు పడేలా చూశారు. అన్ స్టాపబుల్ రెండో సీజన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబును గెస్ట్‌గా పిలిచారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు షో నిర్వహుకులు.
గెస్ట్‌గా వచ్చిన చంద్రబాబు తన పాత జ్క్షాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను వైఎస్ఆర్ మంచి మిత్రులం అని.. యూత్‌లో ఉన్నప్పుడు తాను కూడా అమ్మాయిల చూట్టు తిరిగే వాడినని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచిన సమయంను కూడా నెమరు వేసుకున్నారు. అయితే ఈ షోలో చంద్రబాబుతో పాటు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో ఓడిపోవడం దగ్గర నుంచి…అమెరికా అమ్మాయిలతో ఎంజాయ్ చేసిన ఫొటోల గురించి లోకేష్‌ను ప్రశ్నించారు బాలయ్య. ఈ ఫోటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని.. దానిపై మీరు ఏమాంటారని చంద్రబాబును ప్రశ్నించారాయన. దీనిపై చంద్రబాబు సమాధానం ఇస్తూ.. పిల్లనిచ్చిన మామకు లేని బాధ .. నాకు ఎందకని బాలయ్యకు కౌంటరిచ్చారాయన. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది.