Thursday, December 12, 2024

Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటిపై బీజేపీ అలా ఫిక్స్ చేసిందా?

- Advertisement -

Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కేంద్రం టార్గెట్ చేసుకుందా? అసలు టార్గెట్ రేవంత్ పైనేనా? పొంగులేటి ద్వారా సీఎంను కట్టడి చేయాలని బీజేపీ హైకమాండ్ ప్రయత్నిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేడ్ రైడ్స్‌ కలకలం రేపాయి. హైదరాబాద్, ఖమ్మం నగరంలోని మంత్రి నివాసంతోపాటు.. కార్యాలయంలో మొత్తం 16 బృందాలతో కూడిన అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబల్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి. తాజాగా మరోసారి మంత్రి నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈడీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కేవలం తమ పార్టీ నేతలనే టార్గెట్ చేసి దాడులు చేయిస్తోందని మండిపడుతోంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సర్కార్ లో కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ వ్యవహారాలను ఈయనే చక్కబెడుతున్నారు.ఈ క్రమంలో పొంగులేటిని ఈడీ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.డీకే శివ కుమార్‌పై కూడా ఇలాంటి దాడులే జరిగాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. గతంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై కూడా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఇదే తరహాలో ఈడీ దాడులు చేయించింది. ఈ క్రమంలో తెలంగాణలో పొంగులేటిని టార్గెట్ చేయడంతో ఏదైనా రాజకీయం ఉందా అన్న చర్చ జరుగుతోంది. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను టార్గెట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మోడీ సర్కార్‌ సోదాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపిస్తోంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి రాఘవ గ్రూపు అనే సంస్థలు ఉన్నాయి. ఈ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ దేశ వ్యాప్తంగా అనేక కాంట్రాక్ట్‌ పనులు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నారాయణ్‌పేట్- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను కూడా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమాచారం ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగినట్టు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమారుడు ఇటీవల ఖరీదైన వాచ్‌లను హవాలా ద్వారా కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసినా హాజరు లేదు. అందుకే ఈడీ అధికారులు రంగంలోకి దిగి మరోసారి సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. మొత్తంగా మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ రైడ్స్‌పై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ సర్కార్‌ తీరును ప్రజాక్షేత్రం ఎండగట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్‌ అయ్యారు. మంత్రి పొంగులేటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరగడం ఇది మొదటిసారి కాదని అన్నారు. ఆయన కుమారుడి వాచ్ విషయంలోనూ ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ దాడులకు కేంద్రంలోని సర్కారుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు జరగకపోతే కడిగిన ముత్యంలా మంత్రి పొంగులేటి బయటకు వస్తారని ఎంపీ రఘునందర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు రాజకీయ మలుపు తీసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!