Thursday, December 12, 2024

Kavitha: కవిత రీఎంట్రీ..కేసీఆర్ మార్గదర్శకంలో ఆ ముగ్గురు.. బీఆర్ఎస్ లో జోష్

- Advertisement -

Kavitha: తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జైకొట్టారు. తొమ్మిదేళ్ల పాటు అధికారమిచ్చారు. కానీ రకరకాల కారణాలతో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. ప్రత్యర్థుల ఎదుట చులకనగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కస్థానం దక్కకపోయేసరికి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి సమయంలోనే కేసీఆర్ తన బుర్రకు పదునుపెట్టారు. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు కదపడం ప్రారంభించారు. యువత, మహిళలు, రైతులను టార్గెట్ చేసుకుంటున్నారు. తిరిగి వారిని బీఆర్ఎస్ వైపు తిప్పుకుంటే పూర్వ వైభవం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై తన తురుపుముక్క కవితను ప్రయోగిస్తున్నారు. దీంతో కవిత రీ ఎంట్రీకి పక్కగా ప్లాన్ జరుగుతోంది. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోంది.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహించింది బీఆర్ఎస్ సర్కార్. బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే విధంగా క్రియేట్ చేసుకుంది. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిచయం చేసింది కవిత. పొలిటికల్ రీఎంట్రీకి బతుకమ్మ ఫెస్టివల్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవాలని ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్. కవిత అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుందన్నది ఆ పార్టీ ఆలోచన. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీకి సహాయ పడుతుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అక్టోబరు ఒకటి లేదా రెండున ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ఆ పార్టీ అంతర్గత సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కవిత రీఎంట్రీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పుంజుకుంటే ఆమెకే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె జాతీయ రాజకీయాలైతే బెటరని అంటున్నారు. గతంలో కూడా తన వాణి బలంగా వినిపించిందని అంటున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు ప్రీ బస్సు సౌకర్యం కలిపించారు. మహిళల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పడుతుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. దాన్ని విడగొట్టాలన్నది కవిత స్కెచ్‌గా చెబుతున్నారు. అందుకే బతుకమ్మ ఫెస్టివల్‌ను వేదికగా మార్చుకుందన్నది కొందరి నేతల మాట. రీఎంట్రీ సమయంలో లిక్కర్ స్కామ్ గురించి ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ వర్గాల మాట.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చిక్కుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. కాస్తా రిలాక్స్ అయ్యారు. గడిచిన వారంరోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగించారామె. వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది.ఎప్పుడు? ఎలా? చేయాలన్న దానిపై చర్చలు జరిపారు. పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఆమె, ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల నున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ ఒకటి లేదా రెండు ముహూర్తం పెట్టినట్టు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గులాభీ పార్టీలో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. కేసీఆర్ మార్గదర్శకంలో కేటీఆర్ యువతను, హరీష్ రావు రైతాంగాన్ని, కవిత మహిళలను టార్గెట్ చేసుకుంటూ పోతే పార్టీకి పూర్వ వైభవం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!