Monday, February 10, 2025

రాజకీయ అవకాశవాది పవన్.. మరోసారి ప్రకాష్ రాజ్ ఊచకోత!

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటారు. వామపక్షాలతో కలిసిన ఆయన తరువాత కాషాయ దళంలోకి వెళ్లారు. మధ్యలో ఉత్తరప్రదేశ్ వెళ్లి మాయావతి ని కీర్తించారు. అయితే దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఇబ్బందులు పడుతూ పార్టీని నడిపారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఏపీకి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే పదవి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిపై పలువురు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గతంలో తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ పై నేరుగా విమర్శలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. పవన్ గురించి ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రకాష్ రాజ్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, బిజెపి అనుకూల వైఖరుల పైన కూడా పలు రకాల విమర్శలు చేశారు. చేగువేరా, గద్దర్ లాంటి వ్యక్తులకు బిజెపితో అసలు సంబంధం ఏంటని.. ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి కొంచమైనా సిగ్గుండాలి అంటూ విమర్శించారు. వీరందరూ కూడా బిజెపి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్నారని.. అసలు ప్రమాదంలో ఉన్నది బీజేపీ అంటూ ఆరోపించారు ప్రకాష్ రాజ్.

ఫుట్బాల్ క్రీడలో బాల్ మాదిరిగా పవన్ వ్యవహరిస్తున్నారని తేలికగా మాట్లాడారు ప్రకాష్ రాజ్. బాల్ ను క్రీడాకారులు పంపు ఉంటే ఎటు పోతున్నాననే విషయం దానికి తెలియదని.. అదే మాదిరిగా పవన్ వైఖరి ఉందని దుయ్యబట్టారు. గతం లో కులం, మతం లేదని పవన్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పెరియార్ ను పొగిడి ఇప్పుడు బిజెపికి ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు. సినిమాల్లో ఒక నటుడు ఎన్ని పాత్రలు పోషించిన ప్రజలు ఆదరిస్తారని.. కానీ రాజకీయాల్లో అలా ఉండదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలన్నారు ప్రకాష్ రాజ్. తమిళ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విషయంలో ప్రకాష్ రాజు కొరకరాని కొయ్యగా మారిపోయారు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ బిజెపిని ఎక్కువగా వ్యతిరేకిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి సైతం టార్గెట్ అయ్యారు. అయితే ఆయన ఇండియన్ పాపులర్ యాక్టర్ కావడంతో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. అయినా సరే ప్రకాష్ రాజు వెనక్కి తగ్గలేదు. అయితే ఏపీలో బిజెపికి బలమైన ప్రతిపక్షంగా టిడిపి ఉంది. కానీ టిడిపిని కాదని జనసేన ను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు ప్రకాష్ రాజ్. పార్టీల కంటే పవన్ కు ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కు సైతం మింగుడు పడడం లేదు. అయితే ప్రకాష్ రాజ్ విమర్శలను పవన్ కూడా పట్టించుకోవడం మానేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!