Friday, October 4, 2024

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన హాట్ బ్యూటీ .. ఇక రచ్చ రచ్చే..

- Advertisement -

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో బెజవాడ బేబక్క ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండో వారంలో శేఖర్ భాషా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రెండు వారాలు గడిచాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మునుపెన్నడూ చూడని విధంగా కొత్త కాన్సెప్ట్‌లు, టాస్క్‌లతో ముందుకు సాగుతోంది. ముందే చెప్పుకున్నట్టు బిగ్ బాస్ ప్రేమికులకు అపరిమిత వినోదాన్ని అందించనుంది. షో మొదలై రెండు వారాలైంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు ఇప్పటి వరకు వినిపిస్తున్నాయి. హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌కి పంపనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హాట్ మరెవరో కాదు.. గత సీజన్ లో దుమ్మురేపిన గీతూ రాయల్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేది ముందుగా జ్యోతిరాయ్ అని ప్రచారం జరిగింది. కానీ ఆమె బిజీగా ఉండడంతో హౌసులోకి ఎంట్రీ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలోకి చిత్తూరు బిడ్డ గీతూ రాయల్ వస్తోందన్న ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఈ భామ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. సీమ యాసలో మాట్లాడుతూ.. ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన నటనతో, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు పుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించి.. పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకుంది..

గీతూ రాయల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ‘బిగ్ బాస్‌పై నా ప్రేమ శాశ్వతమైనది’ అంటూ రాసుకొచ్చింది. అలాగే పలు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇక రచ్చ రచ్చే అని బీబీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె వస్తే హౌసంతా సందడి చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు ముక్కు అవినాష్, శోభాశెట్టి, రోహిణి, హరితేజ, నయని పావనిలను వైల్డ్ కార్డ్‌లతో హౌస్‌లోకి తీసుకురాబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. నేడు సోమవారం కావడంతో కొత్త నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!