Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారాంతానికి చేరుకుంది. మొదటి వారం ఎలిమినేట్ అయిన బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్.. మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనేది క్యూరియాసిటీగా మారింది. మూడో వారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరిపైనే పడుతుందని అంటున్నారు. కేవలం ఒక్కరోజులోనే జరిగిన మూడో వారం నామినేషన్ల ప్రక్రియలో 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. కనీసం రెండు ఓట్లు వచ్చిన హౌస్‌మేట్స్‌ని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో నాగ మణికంఠ, సీత, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీరాజ్, సెల్ఫ్ నామినేట్ అయిన అభయ్ నవీన్, మొత్తం 8 మంది మూడవ వారం నామినేషన్లలో ఉన్నారు.
బిగ్ బాస్-8వ సీజన్ ఆడియెన్స్ ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా హౌస్‌లోకి వెళ్లిన వారెవరో ప్రేక్షకులకు తెలియకపోవడంతో ప్రేక్షకులు విసిగిపోతున్నారు. దాంతో గత సీజన్ కంటే దారుణమైన రేటింగ్‌లు వచ్చేలా కూడా కంటెస్టెంట్లు కొన్ని పనులు ఉంటున్నాయి. కానీ బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభంలో కొత్త ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సమాచారం. అంటే గత సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను ఈసారి కూడా హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే కొందరి పేర్లు ఖరారైనట్లు సమాచారం. అలాంటి వారిని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ చేసేందుకు నలుగురు కంటెస్టెంట్స్ ఎంపికైనట్లు సమాచారం.. ముందుగా రోహిణి పేరు వినిపించగా, ఆ తర్వాత నయని పావని, శోభాశెట్టి, నూక అవినాష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది..రతిక రోజ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈమె కూడా సీజన్-8లోకి అడుగుపెట్టనుందని టాక్. గత సీజన్‌లో కూడా పల్లవి ప్రశాంత్‌తో హౌస్‌లో ఎఫైర్ పెట్టుకుని, చివరకు మళ్లీ అతడితో గొడవ పెట్టుకుంది. ఇంట్లో వాళ్లందరితో రతికా రోజ్ గొడవ పెట్టుకుని చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఆ సీజన్లో ఆమెను తిరిగి హౌసులోకి మరో సారి పంపించినా ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో బిజీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆమెకు ఆశించిన విజయం దక్కడం లేదని సమాచారం. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్-8 సీజన్ లో ఎంట్రీ ఇవ్వబోతోందని తెలిసింది. చూడాలి మరి ఈమె ఎంట్రీ ఇస్తుందో లేదో.